సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ ఎలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా నాలుగు గోడల మధ్య జరిగే విషయాన్నీ కూడా నలుగురిలో బయట పెట్టడానికి ఏం మాత్రం మొహమాట పడట్లేదు స్టార్ హీరోయిన్స్ . తాజాగా అలాంటి పని చేసి సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్కి గురవుతుంది హీరోయిన్ కరీనాకపూర్.
బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్గా రాజ్యం ఏలేసిన కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు బిడ్డలను కూడా కనేసింది. కాగా ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా సినిమాలు చేస్తూ లైఫ్ ని ముందుకు తీసుకెళ్తున్న కరీనాకపూర్ .. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసింది .
“మీరు ఇంతకుముందే పెళ్లి అయిన సైఫ్ ని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని “హోస్ట్ ప్రశ్నించారు . దీంతో ఆమె మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చింది. ” పిల్లలను కనేందుకు మ్యారేజ్ చేసుకోవాలనేదే నా ఉద్దేశం .. లేకపోతే ఇప్పటికీ లివింగ్ రిలేషన్ షిప్ లోనే ఉండేదాన్ని.. పెళ్లికి ముందు కూడా ఐదేళ్లు అలాగే ఉన్నాం ..ఆ తర్వాతే బిడ్డలని కనడానికి ఇలా నిర్ణయించుకున్నాం. నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాం” అంటూ చాలా బోల్డ్ ఆన్సర్ ఇచ్చింది . దీనితో సోషల్ మీడియాలో కరీనాకపూర్ ఆన్సర్ వైరల్ అవుతుంది. ఇంత పచ్చిగా బోల్డ్ గా ఎలా స్పందించగలిగావు కరీనా అంటూ ఫ్యాన్స్ కూడా షాక్ అయిపోతున్నారు..!!