టాలీవుడ్ లో మంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్న ఫస్ట్ సింగిల్స్ లో గుంటూరు కారందే. అసలు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందా ? అని నాలుగైదు నెలలుగా కళ్లు కాయలు కాచేలా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ రోజు మొదటి పాటగా దమ్ మసాలా వచ్చేసింది. చాలా మంది త్రివిక్రమ్ మార్క్ మాస్ ట్యూన్, మాస్ బిరియానీ, థమన్ అదరగొట్టేశాడు అంటున్నారే తప్పా నిజంగా ఈ ట్యూన్ ఏ మాత్రం క్యాచీగా లేదనే చెప్పాలి. నిజం చెప్పాలంటే సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో మహేష్ అభిమానులే ఈ సాంగ్ పెద్దగా నచ్చలేదని కామెంట్లు చేస్తూ పెదవి విరుస్తున్నారు.
రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన సాహిత్యం మహేష్ ఎంట్రీ మీద సాగేలా ఉంది. సాహిత్యం ఓ మోస్తరుగా .. మహేష్ క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసేలా ఉన్నా ట్యూన్, సాంగ్ పాడిన తీరు ఏ మాత్రం క్యాచీగా లేదు. సంజిత్ హెగ్డేతో కలిసి సంగీత దర్శకుడు తమన్ ఈ పాటను పాడారు. పాట పాడిన తీరు కూడా పెద్దగా నొప్పలేదు. అయితే రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో బుర్రిపాలెం బుల్లోడు అంటూ మహేష్ సొంతూరు గుర్తుకు తెచ్చారు. సుర్రు సురక ఈడు – నేనో నిశ్శబ్దం… అనినిత్యం నాతో నాకే యుద్ధం అనే లైన్లు బాగున్నాయి.
థమన్ వాడిన ఇన్‌స్ట్రమెంట్స్, ఆ మ్యూజిక్ ఒక్కోసాఆరి అల వైకుంఠపురంలో మ్యూజిక్ గుర్తు చేసింది. ఏదేమైన అల వైకుంఠపురం ఆల్బమ్‌లోని ఏ ఒక్క సాంగ్‌కు కూడా ఈ దమ్ మసాలా సాంగ్ పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. వినగా వినగా ఏమైనా ఎక్కుతుందేమో కానీ దమ్ దంచికొట్టలేదు. చివరకు సాంగ్ తర్వాత వచ్చే కోరస్ కూడా థమన్ గత సినిమాల్లోనుంచి కాపీ కొట్టేశాడని క్లీయర్‌గా తెలుస్తోంది.
ఉన్నంతలో ఊరట ఏంటంటే మహేష్ లుక్, స్టైల్ మాత్రం బాగుంది. మనోడు చొక్కా గుండీ తీసేసి ఊరమాస్‌గా కనిపించాడు. మనం మాస్ మహేష్‌ను చూడబోతున్నాం అన్నది క్లారిటీ వచ్చేసింది. ఏదేమైనా మ్యూజిక్ విషయంలో ముందు నుంచి మహేష్‌కు ఉన్న అనుమానాలు థమన్ నిజం చేసేశాడు. మరి తర్వాత సాంగ్‌లు ఎలా ఉంటాయో ? ఈ సినిమాను థమన్ ఏ తీరానికి చేర్చుతాడో చూడాలి.