Newsప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఫుల్లుగా న‌మ్ముకుని నిండా మునిగిన హీరోయిన్‌... పాపం ఎవ్వ‌రూ...

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఫుల్లుగా న‌మ్ముకుని నిండా మునిగిన హీరోయిన్‌… పాపం ఎవ్వ‌రూ చెప్ప‌లేదా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన హీరోయిన్స్ చాలామందికి మంచి క్రేజ్‌ దక్కుతుంది. అలా అని ఆయన సరసన నటించిన అందరు హీరోయిన్స్ కి ఆ క్రేజ్ వచ్చేస్తుందనుకుంటే పొరపాటే. కొమరం పులి సినిమానే దీనికి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన నికీషా పటేల్ అడ్రస్ లేదు. అలాగే మరికొందరు హీరోయిన్స్ కూడా ఉన్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాలు నాలుగు ఫ్లాపైనా 5వ సినిమాకి ఉండే ఓపెనింగ్స్ ఎవరూ ఊహించలేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన ఒక్కడికే కుదిరిందనుకోవాలి. ఇక పవన్ కళ్యాన్ తన సినిమాలో హీరోయిన్ గా ఫాంలో ఉన్న అమ్మాయే కావాలని పట్టుపట్టరు. దీనికి ఉదాహరణ శృతి హాసన్. గబ్బర్ సింగ్ సినిమా చేసేవరకూ శృతి హాసన్ కెరీర్‌లో గట్టి హిట్టు లేదు. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఈ బ్యూటీకీ అన్నీ భాషలలో స్టార్ స్టేటస్ వచ్చింది.

అలాంటి ఉదాహరణలు తీసుకుందో ఏమో గానీ పాపం నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ సరసన సినిమా అనగానే ఆకాశంలో తేలిపోయింది. వకీల్ సాబ్ తర్వాత పవన్ కమిటైన అరడజను సినిమాలలో హరిహర వీరమల్లు ఒకటి. ఇది పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. దీనికి క్రిష్ దర్శకుడు. ఏ ఎం రత్నం నిర్మాత. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సినిమా రిలీజైయ్యాక ఒక్క టీజర్ మాత్రమే వచ్చింది.

ఈ టీజర్ చూసిన అందరూ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియన్ స్థాయిలో ఇప్పటి వరకూ ఉన్న రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేస్తాడని భావించారు. కట్ చేస్తే సీన్ మొత్తం మారిపోయింది. ఈ సినిమా తర్వాత ఒప్పుకున్న భీమ్లా నాయక్, బ్రో రిలీజై జనాలు మర్చిపోయారు కూడా. కానీ, వీరమల్లు పరిస్థితి ఏంటో తెలీదు. అందరికంటే ఈ సినిమా మీద ఎక్కువ నమ్మకాలు పెట్టుకుంది నిధి అగర్వాల్. ఇస్మార్ట్ శంకర్ లాంటి మాసీవ్ హిట్ ఉన్నా దాన్ని కెరీర్ కోసం ఉపయోగించుకోలేకపోయింది. అటు తమిళంలో రెండు హిట్స్ ఉన్నా..మళ్ళీ అక్కడ ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు. అన్నీ రకాలుగా పవన్ కళ్యాణ్ సినిమా మీద గంపెడు ఆశలు పెట్టుకొని ఇప్పుడు ఉసూరుమంటుంది నిధి అగర్వాల్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news