అలవైకుంఠపురంలో సినిమా తర్వాత టాలీవుడ్ లోనూ ఇటు తెలుగు సినీ అభిమానుల్లోనూ ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా థమన్ పేరు పాపులర్ అయిపోయింది. ఇక అఖండ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి మిడిల్ రేంజ్ హీరోల వరకు అందరూ థమన్ వెంటనే పడుతున్నారు. అదే టైంలో సరైన ఆల్బమ్‌లో ఇవ్వకపోవడంతో దేవిశ్రీప్రసాద్ పేరు ఒక్కసారిగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపించడం ఆగిపోయింది.
దేవిశ్రీప్రసాద్ తో చాలా రోజులుగా ప్రయాణం సాగించిన పలువురు దర్శకులు, హీరోలు కూడా థమన్‌ని దగ్గరికి తీశారు. దేవీ ఆ టైంలో పూర్తి సైలెంట్ అయిపోయారు. అయితే పుష్ప సినిమాతో దేవి తానేంటో తిరిగి ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత చూస్తుంటే సీన్ రివర్స్ అవుతోంది. దేవీని పక్కన పెట్టిన ఒక్కొక్కరు దగ్గరికి తీస్తున్నారు. థమన్ వెంటపడిన వారందరూ థమన్‌ని దూరం పెట్టేస్తున్నారు.
సుకుమార్, హరీష్ శంకర్ లాంటి దర్శకులు దేవిశ్రీ ని ఎప్పుడు వదలలేదు. వాళ్ళ సినిమాలు ఎలాగు ఉన్నాయి. అలా కాక ఇప్పుడు కొత్త ప్రామిసింగ్ ప్రాజెక్టులు కూడా దేవీ చేతుల్లోకి వస్తున్నాయి. మంచి పాటలు చేయించుకునే శేఖర్ కమ్ముల, క్రాంతి శేఖర్ లాంటి దర్శకుల సినిమా కూడా దేవీ దగ్గరికి వస్తోంది. చందు మొండేటి, నాగచైతన్య తండాలా సినిమా కూడా దేవి శ్రీ దగ్గరకే వెళుతుంది. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలు ఇద్దరు ఇప్పటివరకు థమన్ వెంటా పడ్డారు.
ఇప్పుడు వాళ్ళు తమన్‌ను పక్కన పెట్టేసి తమ తర్వాత సినిమాలకు వరుసగా దేవిశ్రీకే ఛాన్సులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా థమన్ దెబ్బతో చాలామంది విసిగిపోతున్నారు. బాగా టైం తీసుకుంటున్నాడు. ఒకరిద్దరు హీరోలకి మినహ చాలామందికి సరైన క్వాలిటీ ఔట్పుట్ ఇవ్వటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇదే దేవిశ్రీ కి ప్లస్ కానుంది. అందుకే ఇప్పుడు దేవి టైం స్టార్ట్ అయిందని టాలీవుడ్లో చర్చ అయితే మొదలైంది.