ఇప్పుడు సోషల్ మీడియాలో నాగచైతన్య – సమంత మళ్ళీ కలవబోతున్నారు అన్న వార్త ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా సమంత ఎంతో ఇష్టంగా పెంచుకున్న హాష్ నాగచైతన్య వద్దకు వచ్చినప్పటి నుంచి ఆయన సోషల్ మీడియాలో పలు రకాల ఫోటోలు వీడియోలు షేర్ చేస్తున్నారు. దీనితో త్వరలోనే చైతన్య సమంత కూడా ఒకటి కాబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది .
అయితే విశ్వసనీయవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ..అలాంటిది ఏమీ లేదు కేవలం సమంత కుక్క హ్యాష్ మాత్రమే అక్కినేని కాంపౌండ్ లోకి అడుగు పెట్టింది .. కొన్ని రోజుల తర్వాత మళ్లీ హాష్ సమంత వద్దకే వెళ్లిపోతుంది . అయితే ఇలాంటి క్రమంలోని సమంత సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కూడా వైరల్ గా మారింది.
“దయా గుణాన్ని వ్యూహంగా కాకుండా జీవిత మార్గంగా అలవర్చుకునే వారికి హ్యాట్సాఫ్ అంటూ సమంత తన పోస్టుల పేర్కొంది “. అయితే సమంత ఎందుకు ఈ పోస్ట్ చేసింది.. ? ఎవరిని దృష్టిలో పెట్టుకొని పోస్ట్ చేసింది ..? సమంత అసలు ఏ కారణంగా ఈ పోస్ట్ పెట్టింది ..? అంటూ పలు విధాలుగా ఆమెను ట్రోల్ చేశారు జనాలు. దీంతో ఫుల్ ఫైర్ అయిపోయిన సమంత ఈ పోస్ట్ పై మళ్లీ స్పందించింది. ఒక మంచి మాట చెబితే దానిలోని అర్ధాన్ని అర్థం చేసుకోకుండా ఆచరించడానికి ప్రయత్నించకుండా తొక్కలో ట్రోలింగ్ చేస్తూ ..దానికి పెడార్థాలు వెతికే వాళ్ళను ఏమనాలి అంటూ సెటైర్ వేసింది . దీంతో సమంత నాగచైతన్యలు కలవడం లేదు అన్న విషయం చెప్పకనే చెప్పేసింది అంటున్నారు ఫ్యాన్స్..!!