ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నా పక్క భాషల నుంచి ఎంతోమంది వస్తున్నారు. అయినా కూడా తమన్ మార్కెట్ ఏమీ పడిపోలేదు. తమన్ గత పదేళ్లుగా టాలీవుడ్లో ఫుల్ బిజీగానే ఉంటున్నారు. అదే సమయంలో తమన్ తన వర్క్ మీద గట్టిగా కాన్సన్ట్రేషన్ చేయడం లేదన్న చర్చలు టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వినిపిస్తున్నాయి. అలవైకుంఠపురంలో సినిమా తర్వాత తమన్‌కు తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలోనే ఎన్నో ఛాన్సులు వచ్చాయి.
తెలుగులో స్టార్ హీరోల నుంచి మిడిల్ రేంజ్ హీరోల వరకు అందరూ తమన్‌తో పని చేయాలని అనుకున్నారు. ఎక్కువ ఛాన్సులు వస్తుండడంతో మరింతగా కష్టపడాల్సిన తమన్ బాగా బద్ధకస్తుగా మారిపోయాడు అన్న విమర్శలు వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో తమన్ మీద గట్టి ట్రోలింగ్ జరుగుతోంది. రాను రాను టాలీవుడ్ నిర్మాతలు కూడా తమన్ వ్యవహార శైలితో కింద మీద పడుతున్నారు. ఇటు స్టార్ హీరోలకు కూడా తమన్ అవుట్ పుట్ నచ్చటం లేదని తెలుస్తోంది.
ప్రతి ట్రైలర్ అవుట్ పుట్ లాస్ట్ మినిట్ వరకు ఇవ్వడం లేదట. పోనీ క్వాలిటీ ఉందా అంటే అది కూడా లేదు. ప్రొడక్ట్ మీద కాపీ మార్క్ పడుతుంది. భగవంత్ కేసరి ట్రైలర్ విషయంలో అనుకున్న స్థాయిలో అప్డేట్ ఇవ్వలేదన్న చర్చ నడుస్తోంది. విక్రమ్ సినిమా నుంచి ప్రభావితమై బ్రో సినిమాకు ఆర్ఆర్ అందించాడన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు భగవంత్ కేసరి ట్రైలర్ ఆర్ఆర్ లో కూడా పాత సినిమాల మ్యూజిక్ నీడలు కనిపిస్తున్నాయి. స్కంద సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో తమన్ పై గట్టి విమర్శలు వచ్చాయి. చివరకు బోయపాటి కూడా దీనిపై తన అసహనం వ్యక్తం చేశాడు.
అఖండ సినిమా బ్యాక్ గ్రౌండ్ విషయంలో తమన్‌కు క్రెడిట్ ఇవ్వడానికి బోయపాటి ఇష్టపడలేదు. అందులో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేకపోయినా.. ప్రేక్షకులు హై రేంజ్ లో కనెక్ట్ అయ్యేలా సీన్లు తీశానని తనకు తానే గొప్పగా చెప్పుకున్నాడు. అంటే అంత గొప్ప మ్యూజిక్ ఇచ్చిన తమన్ పట్ల ఎవరు ? సాటిస్ఫై గా లేరు. తమన్‌కు, స్కంద నిర్మాత చిట్టూరు శ్రీనుకు మధ్య చిన్న గడబిడ జరిగిందన్న గుసగుసలు కూడా ఉన్నాయి. ఇక గుంటూరు కారం సినిమా విషయంలో ముందు నుంచి తమన్‌కు చాన్స్ ఇవ్వడానికి మహేష్ ఇంట్రెస్ట్‌గా లేదన్న ప్రచారం గట్టిగా జరిగింది. ఏదో త్రివిక్రమ్ పట్టుబట్టి మరి తమన్‌ను తీసుకోవలసి వచ్చింది.
ఆ తర్వాత కూడా మహేష్ తమన్‌ను తప్పించడానికి చాలా ట్రై చేసినా త్రివిక్రమ్ బలవంతం మీద కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం తమన్ చేతిలో బాలయ్య భగవంత కేసరి ఉంది. సంక్రాంతికి గుంటూరు కారం ఉంది. ఈ రెండిటి విషయంలో తమన్ ప్రూవ్ చేసుకుంటేనే తమన్ క్రేజ్ కొనసాగుతుంది. లేకపోతే తమన్‌లో రసం అయిపోయిందన్న విమర్శలు మరింత వచ్చేస్తాయి. ఆ తర్వాత గేమ్ చేంజర్ సినిమా ఉంది. ఏది ఏమైనా భగవంత్ కేసరి – గుంటూరు కారం సినిమాల విషయంలో తమన్ ప్రూవ్ చేసుకోపోతే టాలీవుడ్ లో ఇప్పటికే టార్గెట్ అయిన థమన్ మరింత టార్గెట్ అయిపోతాడు అనటంలో సందేహం లేదు.