Newsస‌చిన్ కూతురు సారా ప్రియుడు శుభ‌మ‌న్ గిల్‌ కోసం ఏం చేసిందో...

స‌చిన్ కూతురు సారా ప్రియుడు శుభ‌మ‌న్ గిల్‌ కోసం ఏం చేసిందో చూడండి..!

టీమిండియా స్టార్ బ్యాటర్ శుభమన్ గిల్ గత కొద్ది రోజులుగా డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీంతో వరల్డ్ కప్ ఆదివారం జ‌రిగే టీం ఇండియా తొలిమ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఆడటం అనుమానంగా మారింది. గిల్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. గిల్‌ త్వరగా కోలుకోవాల‌ని ఆశిస్తూ.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోకి బరిలోకి దిగాలని భారతదేశం కోరుకుంటుంది.

ఈ క్ర‌మంలోనే త‌న ప్రియుడు గిల్‌ త్వరగా కోలుకోవాలని క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గారాల పుత్రిక సారా టెండూల్కర్ కూడా కోరుకుంటుంది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది. అయితే అది సారా చేసిన ట్వీట్ లేదా ఫేక్ ట్వీట్ చేశారా ? అన్నది తెలియాల్సి ఉంది. ఇక శుభమన్ గిల్ – సారా టెండూల్కర్ మధ్య ప్రేమాయణం నడుస్తుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఇప్పుడు సార్ ఆ ట్వీట్ చేసిన‌ నేపథ్యంలో ఈ వార్తలు నిజమే అని.. మరోసారి ఫ్రూవ్‌ అయినట్టు జాతీయ‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సచిన్ టెండూల్కర్ కూడా ఇటీవ‌ల గిల్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తన కుమార్తె సారా – శుభమన్ గిల్ ప్రేమలో ఉన్న విషయం సచిన్ టెండూల్కర్ కు కూడా తెలుసు అని.. అత‌డే గిల్‌ను తన అల్లుడిగా చేసుకునేందుకు ఇష్టపడుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news