సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలంటే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్టార్ హీరో, హీరోయిన్లుగా కొనసాగుతున్న వారు కూడా కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వారే..! దర్శకులు, హీరోలు, హీరోయిన్లు కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని వాటిని తట్టుకుని ఈ స్థాయికి వస్తుంటారు. ఇక హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొని వాటిని అధిగమించి ఛాన్సులు దక్కించుకొని ఒకటి రెండు హిట్లు పడ్డాక కానీ గుర్తింపు తెచ్చుకోలేరు.
ఇలాంటి పనులు చేయడం ఇష్టం లేనివారు టాలెంట్ ఉండి కూడా కెరీర్ వదులుకుంటున్నారు. ఇక క్యాస్టింగ్ కౌచ్ అనేది సౌత్ కంటే నార్త్ లో బాగా ఎక్కువ. బాలీవుడ్లో శ్రీదేవి స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న టైంలోనే ఆమెను వెనక్కి నెట్టి మరి మరో హీరోయిన్గా వరుస అవకాశాలు అందుకున్నారు మరో హీరోయిన్. అప్పట్లో సౌత్ నుంచి వెళ్లిన శ్రీదేవి డామినేషన్ తట్టుకునేందుకు ఆ హీరోయిన్ ఎంతకు అయినా తెగించేవారు అన్న గుసగుసలు బీటౌన్లో ఉండేవి.
ఆమె ఓ నిర్మాత సహాయంతోనే వరుసుగా అవకాశాలు అందుకుని ఇండస్ట్రీని ఏలేసింది. ఆ నిర్మాత కూడా ఆ హీరోయిన్ ని తనకు ఇష్టం వచ్చినట్టు వాడుకోవడంతో పాటు ఆమెకు అవకాశాలు కల్పించారన్న ప్రచారం ఉంది. తనకు జీవితం ఇచ్చిన ఆ నిర్మాతకు సర్వస్వం ధారబోసిన ఆ హీరోయిన్ ఆ తర్వాత స్టార్ హీరోయిన్ అయి కూడా అదే నిర్మాత చేతిలో దారుణంగా మోసపోయింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి సదరు నిర్మాత ఆమెకు సినిమా అవకాశాలు కల్పించారు. అయితే సదరు నిర్మాతకు అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్న విషయాన్ని దాచి ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటానని మాటలతో మాయ చేసారు.
అప్పటికే ఆ హీరోయిన్ ఫుల్లుగా వాడుకున్న నిర్మాత ఆమెను క్రమక్రమంగా దూరం పెడుతూ వచ్చారు. చివరకు ఆమెన్ ఎంక్వయిరీ చేయగా ఆ నిర్మాతకు అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా షాక్ అయింది. ఆ వ్యక్తి చేతిలో దారుణంగా మోసపోయానని ఎంతో ఆవేదనకు గురైంది. అయినా కూడా ఆ హీరోయిన్ తనను వాడుకున్న అతడినే ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. తనను పెళ్లి చేసుకోకపోతే తనతో ఉన్న ఫోటోలు, వీడియోలు బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేసింది.
ఆమె బ్లాక్ మెయిల్ చేయడంతో పెళ్లికి ఒప్పుకున్నట్టు నటించిన నిర్మాత సరదాగా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ ఉండగా ఆమెను నీళ్లలో ముంచి ఊపిరాడకుండా చేసి చంపివేయలని ప్రయత్నించాడు. అయితే ఆమె తేరుకుని తన చేతి గోళ్ళతో ఆ నిర్మాత పై దాడి చేసి బయటపడింది. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడు నాలుగేళ్లు జైల్లో కూడా ఉన్నాడు.
ఈ విషయం అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాక ఇండియన్ సినిమా చరిత్రలో సంచలనంగా మారింది. ఆ స్టార్ హీరోయిన్, నిర్మాత ఎవరో ?ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇదంతా ఇప్పుడు ప్రస్తావించడానికి కారణం ఏంటంటే సినిమా కెరియర్లో ప్రారంభంలో అవకాశాల కోసం కొందరు వాడుకుని ఎలా ? మోసం చేస్తూ ఉంటారో చెప్పేందుకు ఇది పెద్ద ఉదాహరణ.