Newsఆ హీరోయిన్ అంటే తార‌క్‌కు అంత ఇష్ట‌మా... ఆమె సినిమాల‌న్నీ వ‌ద‌ల‌కుండా...

ఆ హీరోయిన్ అంటే తార‌క్‌కు అంత ఇష్ట‌మా… ఆమె సినిమాల‌న్నీ వ‌ద‌ల‌కుండా చూసేయాల్సిందే..!

నిత్యా మీనన్ నిజంగా ఎంతో గొప్ప నటి. మలయాళంలో పుట్టి సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. నిత్యామీనన్‌కు మిగిలిన హీరోయిన్లకు చాలా వ్య‌త్యాసాలు ఉంటాయి. పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకుని ఆమె కెరియర్లో అలా ముందుకు వెళుతూ ఉంటుంది. అటువైపు ఉన్నది ఎంత స్టార్ హీరో అయినా నిత్య పక్కన నటించాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు అన్నది వాస్తవం.

ఎందుకంటే నిత్యమీన‌న్‌ అటువైపు హీరోలు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న తన నటనతో చాలా సులువుగా డామినేట్ చేస్తూ ఉంటుంది. మిగిలిన హీరోయిన్ల లాగా అంగాంగ‌ ప్రదర్శన చేయటం ఆమె వల్ల కాదు. ఆమె పూర్తిస్థాయి భావాలు కలిగిన అమ్మాయి. అందుకే ఆమె కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్గా రాణించలేకపోయింది. నిత్యామీనన్ చాలా గొప్ప నటి అయినా ఆమెను సరిగ్గా వాడుకోవటం మన సినిమా వాళ్లకు చేతకాలేదని కూడా చెప్పాలి. ఇక ఆమె టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిత్యామీనన్ మనవాళ్లు సరిగ్గా వాడుకోలేదని ఆమె లాంటి నటిమణి ఎవరికీ దొరకదు.. ఆమె సినిమాలో ఉంటే ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది.. అందుకే నిత్యకు మంచి సినిమాలు వస్తే ఆమెలోని నిజమైన నటీమ‌ణిని బయటకు తీసుకు వచ్చిన వారం అవుతామని చెప్పాడు. నిత్య ఒక బ్రిలియంట్ నటి.. తన పక్కన నటించే వారిని నిత్య తన నటనతో సులభంగా డామినేట్ చేస్తుంది.. ఆమెకు ఇంకా మంచి సినిమాలు పడి ఉండాల్సింది అంటూ తారక్ తెలిపారు..

కేవలం సీరియస్ రోల్స్ మాత్రమే కాకుండా కామెడీ కూడా చక్కగా పండించే నటి అని అందుకే ఆమె సినిమాలు ప్రతిదీ తప్పకుండా చూస్తూ ఉంటానన్నాడు. జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఆమె చాలా బాగా నటిస్తుందన్న నమ్మకం మాకు ఉండేదని.. ఆమె దానిని ప్రూవ్ చేసి నిరూపించుకుందని తారక్‌ తెలిపాడు. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ కి జోడిగా నటించిన భీమ్లా నాయక్ సినిమా తర్వాత మరి ఏ సినిమాలోని నటించలేదు. తమిళంలో ధనుష్ 50వ సినిమాలో మెయిన్ లీడ్‌ చేస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news