ఇక మన చిత్ర పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమాలో మరో హీరో నటించి సక్సెస్ కొట్టడం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా చాలామంది హీరోలు మంచి మంచి కథలను వదులుకున్నారు. అయితే అదే కథలను మరో హీరో చేసి సూపర్ హిట్ అందుకున్నారు. అదేవిధంగా నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా తన కెరీర్లో ఒక సినిమాను చేతులారా వదులుకోగా.. అదే కథను మోహన్ బాబు చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
సీనియర్ నటుడు మోహన్ బాబు తన కెరీర్ లో హీరోగా వరుస అపజయాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో దర్శకేంద్రుడు కే రాఘవేందర్రావును ఓ సినిమా చేసి పెట్టాలని అడిగారట. అయితే రాఘవేంద్రరావు అప్పటికే చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి బంపర్ హిట్ విజయంతో మంచి ఫామ్ లో ఉన్నాడు. అలాంటి సమయంలో ఆ సినిమా తర్వాత రాఘవేంద్రరావు మోహన్ బాబుతో అల్లుడుగారు అనే సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు.
ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ గా నిలిచింది. మోహన్ బాబు కెరిర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా ఈ సినిమా నిలిచింది. అయితే ఈ సినిమా కథ మాత్రం ముందుగా బాలకృష్ణ వద్దకు వచ్చిందట. మలయాళంలో మంచి విజయం సాధించిన ఓ సినిమాకు రీమేక్ ఈ చిత్రం.. మలయాళం లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాకు రీమేక్ అల్లుడుగారు సినిమా.. మలయాళం లో ఈ సినిమా 300 రోజులకు పైగా ఆడింది.
ఈ సినిమా రీమేక్ హక్కులను సీనియర్ నటి సుహాసిని సొంతం చేసుకుంది. అయితే బాలకృష్ణ హీరోగా ఈ సినిమా రీమేక్ చేయాలని అనుకున్నారు. కానీ బాలకృష్ణ మాత్రం ఈ కథకు నో చెప్పడంతో ఆ తర్వాత ఈ రీమేక్ రైట్స్ చేతులు మారి మోహన్ బాబు వద్దకు వచ్చాయి. ఈ విధంగా అల్లుడుగారు సినిమాలో మోహన్ బాబు హీరోగా నటించారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్గా నటించగా సినిమా మంచి విజయం సాధించింది.