Newsమాయాబజార్ సినిమాలో నటించిన ఈ ముసలాయన ఎవరో తెలుసా..!

మాయాబజార్ సినిమాలో నటించిన ఈ ముసలాయన ఎవరో తెలుసా..!

మాయాబజార్ ఈ సినిమా గురించి ఇప్పటి వారికి పెద్దగా తెలియక పోవచ్చు కానీ.. ఈ సినిమా చూస్తే ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమాని ఆ తర్వాత ఇప్పటి కలర్ టెక్నాలజీ లోకి మార్చి రీరిలీజ్ చేశారు. దీంతో నేటితరం వారికి కూడా ఈ సినిమా ఎంతో బాగాా నచ్చింది. ఈ సినిమాల్లో వచ్చే ప్రతి సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా తెర్కెక్కించారు దర్శకుడు కె.వి.రెడ్డి.

అప్పటి దిగ్గజ నిర్మాతలైన నాగిరెడ్డి- చక్రపాణి ఎంతో అద్భుతంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రతిపాత్రను ఎంతో హైలెట్ చేస్తూ వారికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక ఈ సినిమాలో ఓ మాయ కృష్ణుడిగా ఓ వృద్ధుడు కనిపిస్తాడు. ఘటోత్కచుడు రాగానే తన‌ను పైకి లేపితే నీవు గొప్ప అంటాడు కానీ లేపటం తన వల్ల కాదు. చివరికి కృష్ణుడు ప్రత్యక్షం కావడంతో ఘటోత్కచుడు నమస్కరిస్తాడు. అయితే ఆ ముసలివాడి పాత్రలో నటించిన వ్యక్తి గరించి తెలిస్తేతే ఆశ్చర్యపోక మానరు.

చిన మాయ పెదమాయ.. పెదమాయ పెనుమాయ.. అటు స్వాహా.. ఇటు స్వాహ.. ఎరుగకుండ వచ్చావు.. ఎరుకలేకపోతావు.. ఇదే వేదం.. ఇదే వేదం.. చిరంజీవ చిరంజీవ.’ అంటూ పద్యం పాటే ఈయన పేరు కంచి నరసింహారావు. 1934 నుంచి ఈయన సినిమాల్లో కొనసాగుతున్నారంటే ఎవరూ నమ్మరు. కానీ ఇది నిజంగా నిజం. 1935లోవచ్చిన ‘హరిశ్చంద్ర’ సినిమాలో ఆయన కాల కౌశికుడిగా నటించారు. ఆ తరువాత ఏవీఎం వారు తీసిన ‘జీవితం’ అనే సినిమాలో నటించారు. 1955లో వచ్చిన దొంగరాముడు చిత్రంలోనూ కనిపిస్తాడు.

ఇక మాయాబ‌జార్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం ఉంటుంది. సావిత్రిని తీసుకెళ్లేందుకు వచ్చిన ఘటోత్కచుడికి కృష్ణుడు సాయం చేస్తాడు. అయితే అంతకుముందు అతడికి ఓ పరీక్ష పెడుతాడు. ఆ పరీక్షలో భాగంగా ఓ వృద్ధుడిలా కనిపిస్తాడు. ఆ పాత్రలో నటించారు కంచి నరసింహారావు గారు. ఆ కాలంలో సుప్రసిద్ధ నటుడుగా పేరు తెచ్చుకున్న ఈయనను సినిమాల్లోకి తీసుకునేందుకు అప్పటి దర్శకులు ఎంతో ఆసక్తి చూపించే వారట.

ఎలాంటి పాత్రకైనా న్యాయం చేసే కంచి నరసింహారావు గారుకు మాయాబజార్ సినిమానే చివరి సినిమా కావటం మరో విశేషం. ఈ సినిమాలో కొద్దిసేపు కనిపించిన తన పాత్రకు ఎంతో న్యాయం చేశారు. తాను ముసలి వాడినైనా తను పైకి లేపితే నువ్వే గొప్ప అంటూ చమత్కరిస్తూ ఎస్వీ రంగారావు – కంచి నరసింహారావు కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news