ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సినిమా విషయాలకన్నా ఏపీ రాజకీయాల విషయాల పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు స్టార్స్. అంతలా ఇంట్రెస్టింగ్ గా మారిపోయాయి ఏపి రాజకీయాలు. మనకు తెలిసిందే నందమూరి బాలకృష్ణ బావగారు మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు అరెస్టు అయ్యారు . స్కిల్ డెవలప్మెంట్ భారీ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఆయన అరెస్టు చేశారు ఆఫీసర్లు . ఇలాంటి క్రమంలోనే బాలయ్య టోటల్గా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి కేవలం రాజకీయాలపైనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు .
ఆయన కమిటీ అయిన సినిమాలు అన్నీ కూడా హోల్డ్ లో పెట్టేశారు. అయితే ఇలాంటి క్రమంలోనే ఆహాలు అన్ స్టాపబుల్ 3 కి నాంది పలకపోతున్నారు మళ్ళీ బాలయ్య అంటూ న్యూస్ వైరల్ అవుతుంది . నిజానికి బాలయ్యకు ఇప్పుడు హోస్ట్ చేసే టైం కూడా లేదు. కానీ ఈ హోస్టింగ్ ద్వారా టిడిపిని మళ్లీ అధికారంలోకి రాబట్టే ఎన్నో ఛాన్సెస్ ఉన్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు ద్వారా సమాచారం రావడంతో బాలయ్య షో హోస్ట్ చేయడానికి ఎస్ చెప్పారట .
ఆల్రెడీ రెండు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బాలయ్య క్రేజ్ తో పాటు ఆహా సబ్ స్క్రైబర్ల సంఖ్య కూడా పెరిగింది. కాగా ఇప్పుడు ఆహాలో అన్ స్టాపబుల్ సీజన్ 3 ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారట . అంతేకాదు ఈసారి కేవలం సినిమా ప్రముఖులు కాకుండా ఎక్కువగా రాజకీయాలపై కాన్సన్ట్రేషన్ చేసి కేటీఆర్ – కేసిఆర్ – మెగాస్టార్ చిరంజీవి-పురంధేశ్వరి పలువురు బడా రాజకీయ నేతలను ఈ షోకి పిలిపించే ఆలోచనలో ఉన్నారట . తద్వారా క్రేజ్ పాపులారిటీతో పాటు సమాజంలో నేటి రాజకీయాలకు ఎవరు పర్ఫెక్ట్ అనే విషయం కూడా క్లియర్గా అర్థం అయిపోతుంది అని .. టిడిపికి అధికారం రావడానికి షో ఎంతో సహాయపడుతుంది అని రాజకీయ విశ్లేషకులు ద్వారా అందుకున్న సమాచారం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారట. ఒక్కవేళ్ల అదే నిజమైతే మాత్రం ఒకే దెబ్బకు రెండు పిట్టలనే చెప్పాలి ..!!