Movies"ఆయన జైల్లో ఉంటే మాకు ఏంటి సంబంధం..?" చంద్రబాబు అరెస్ట్ పై...

“ఆయన జైల్లో ఉంటే మాకు ఏంటి సంబంధం..?” చంద్రబాబు అరెస్ట్ పై సురేష్ బాబు షాకింగ్ కామెంట్స్..!!

ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే పాలిటిక్స్ పైన ఎక్కువగా చర్చించుకుంటున్నారు . మరీ ముఖ్యంగా మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లు కూడా ఈసారి పాలిటిక్స్ లో కీ రోల్ ప్లే చేస్తూ ఉండడంతో జనాభా కూసింత పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . తాజాగా కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన “సప్త సాగరదాచేల్లో” అనే సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు మేకర్స్ .

ఈ లాంచింగ్ ఈవెంట్లో మీడియా రిపోర్టర్స్ డైరెక్టర్ సురేష్ బాబును ఓ టఫ్ క్వశ్చన్ అడిగారు . సినిమా ఈవెంట్ కి వచ్చి పాలిటిక్స్ గురించి ప్రశ్నించారు. ఈ క్రమంలోని ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పాలిటిక్స్ పై మీ స్పందన ఏంటి సార్ ..? అంటూ ప్రశ్నించారు మీడియా రిపోర్టర్ . అయితే సురేష్ బాబు నిర్మొహమాటంగా అది మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయం కాదు .. సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకి ఏ సంబంధం లేదు .. బహుశా కొంతమంది సినీ స్టార్స్ రాజకీయాల వైపు ఇంట్రెస్ట్ ఉండి అటుగా వెళ్లి ఉండొచ్చు ..అది టోటల్గా వాళ్ళ పర్సనల్ ఛాయిస్ ..

ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకి ముడి పెట్టొద్దు ..అది అదే ఇది ఇదే..మాకు రాజకీయాలతో ఏ సంబంధం లేదు. దాని గురించి ఇప్పుడు మాట్లాడకపోవడమే బెటర్ ..కులమత భాషా బేధాలు లేకుండా సినిమా ఇండస్ట్రీ ముందుకెళ్తుంది .. దాన్ని అలాగే ముందుకు వెళ్ళనివ్వండి ..ఈ రాజకీయాల రంగు పూయ్యొద్దు అంటూ కూసింత గట్టిగానే చెప్పుకొచ్చారు . దీంతో సోషల్ మీడియాలో చంద్రబాబు అరెస్టుపై స్పందించడం ఇష్టంలేక సురేష్ బాబు ఈ విధంగా తప్పించుకున్నాడు అని కౌంటర్స్ వేస్తున్నారు . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news