టాలీవుడ్ లో ఇప్పుడు ఆంటీ క్యారెక్టర్లు వేయాలి అంటే ఒకప్పటి హీరోయిన్లు లైన్లో ఉంటున్నారు. రమ్యకృష్ణ, నదియా, రోజా, సంగీత లాంటి వాళ్లంతా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అక్క, అత్త, వదిన పాత్రలతో పాపులర్ అవుతున్నారు. అయితే కొన్ని ఏళ్ల క్రితం నుంచే టాలీవుడ్ లో ఆంటీ పాత్రలు వేయాలంటే ప్రియా బాగా పాపులర్. ప్రియా ఆంటీ అంటే ఒక సెన్సేషన్ ఇంకా చెప్పాలి అంటే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లకు మించిన సోషల్ మీడియా ఫాలోయింగ్ ప్రియా అంటి సొంతం.
ప్రియా ఆంటీ అసలు పేరు మామిళ్ళపల్లి ప్రియ శైలజ ఆమె 1996లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఆ సినిమాలో ఆమెకు మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమా సూపర్ హిట్ అయిన ఆమెకు సినిమాల్లో మరి ఎక్కువ అవకాశాలు రాలేదు. ఆ తర్వాత బుల్లితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆమె నటించిన ప్రియసఖి సీరియల్ సూపర్ పాపులర్ అయింది.
దీంతో ప్రియా ఆంటీ ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ తర్వాత ఇటు బుల్లితెరతో పాటు అటు వెండితెరిను కూడా చాలా ఏళ్లపాటు ఏలేసింది. తెలుగులో చాలా సినిమాలలో ఆంటీ పాత్రలతో బాగా పాపులర్. సోషల్ మీడియాలో చాలామంది స్టార్ హీరోయిన్లకు లేని క్రేజ్ ఆమె సొంతం చేసుకుంది. అయితే ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ఇబ్బందుల్లో పడింది.
2002లో కిషోర్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు పుట్టాక మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. భర్తకు దూరమయ్యాక కూడా ప్రియా అంటే కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. బాలకృష్ణ, జయసింహ సినిమాలో బ్రహ్మానందం జోడిగా ఆమె ఎలా నవ్వులు తెపించ్చిందో తెలిసిందే ఈ పాత్రకు కూడా ప్రియకు మంచి పేరు వచ్చింది.