Moviesస‌మీరారెడ్డి కంటే ముందే ఎన్టీఆర్‌ను ప్రేమించిన ఆ క్రేజీ హీరోయిన్ ఎవ‌రంటే..!

స‌మీరారెడ్డి కంటే ముందే ఎన్టీఆర్‌ను ప్రేమించిన ఆ క్రేజీ హీరోయిన్ ఎవ‌రంటే..!

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు దశాబ్దాల కెరీర్లు ఎన్టీఆర్ తిరుగులేని స్టార్ డ‌మ్‌ తెచ్చుకున్నారు. అసలు ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రేమికులు అందరూ పూనకలతో ఊగిపోతూ ఉంటారు. తొలిరోజే ఎన్టీఆర్ సినిమా చూడాలన్న ఉత్సాహంతో ఉంటారు. ఎన్టీఆర్‌కు ప్రాంతాలు వర్గాలు, మతాలు, కులాలకు అతీతంగా కోట్లలో అభిమానులు ఉన్నారు.

ఇంకా చెప్పాలంటే 20 ఏళ్లకే స్టూడెంట్ నెంబర్ 1న్, ఆది, సింహాద్రి లాంటి సూపర్ డూపర్ హిట్‌లతో ఎన్టీఆర్ అప్పటి స్టార్ హీరోలకు సైతం చెమటలు పట్టించారు. ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో నటించిన ఏ హీరోయిన్ విషయంలో రాని పుకార్లు ఇద్దరు హీరోయిన్ల విషయంలో మాత్రం ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్ తో అశోక్, నరసింహుడు సినిమాలలో జంటగా నటించినా సమీరా రెడ్డితో ప్రమాణం నడిపాడుని.. వీరిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు అన్న ప్రచారం జరిగింది.

అయితే ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ను ఆమె నుంచి దూరం చేశారని ఆ వెంటనే లక్ష్మీ ప్రణీతితో పెళ్లి చేసేసారని అంటారు. అయితే సమీరా రెడ్డికి ముందే మరో హీరోయిన్ ఎన్టీఆర్ ను ప్రేమించిందన్న విషయం అప్పట్లో పెద్ద హాట్‌ టాపిక్.. అయితే ఎన్టీఆర్ మాత్రం ఆ హీరోయిన్ ను ప్రేమించకపోయిన ఆమె మాత్రం ఎన్టీఆర్ పై మనసు పడిందని అంటారు. ఆమె ఎవరో కాదు గజాల.. గజాల కూడా ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ 1న్, అల్లరి రాముడు సినిమాలలో నటించింది.

ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అల్లరి రాముడు సినిమా నడుస్తున్న టైం లో గజాల తన ప్రేమను ఎన్టీఆర్ ముందు వ్యక్తం చేసిందిని.. ఎన్టీఆర్ సున్నితంగా దానిని తిరస్కరించార‌ని కూడా అప్పట్లో సినీ పత్రికలు రాసుకు వచ్చాయి. ఆ తర్వాత కూడా ఎన్టీఆర్- గజాల కాంబినేషన్లో మరో సినిమా రావాల్సి ఉన్న ఎన్టీఆర్ ఆమెతో నటించేందుకు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవ్వడంతో మూడోసారి ఎన్టీఆర్, గజల కాంబినేషన్ రిపీట్ కాలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news