Moviesఎన్టీఆర్ మార్నింగ్ టిఫిన్ మెనూ చూస్తే నోట మాట రాదంతే… చాంతాడంత...

ఎన్టీఆర్ మార్నింగ్ టిఫిన్ మెనూ చూస్తే నోట మాట రాదంతే… చాంతాడంత లిస్ట్‌…!

సీనియర్ ఎన్టీఆర్ మంచి భోజనం ప్రియుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన భోజనం మెనూ గురించి ఇప్పటికే రకరకాల వార్తలు ఎన్నోసార్లు చూశాం. ఎన్నో మాటలు విన్నాం. అయితే ఆయన ఉదయం సినిమా షూటింగ్ కి వెళ్లే ముందు టిఫిన్ భోజనం మెనూ చూస్తే మనకు నోట మాట రాదు. ఎన్టీఆర్ ఉదయం నాలుగు గంటలకే లేచి వ్యాయామం చేసేవారు. ఆయన నిమ్మకూరులో ఉన్నప్పుడే అప్పుడే తీసిన నుర‌గతో ఉన్న ఆవుపాల ఆవు పాలను చెంబులో నుంచి నేరుగా గటగ‌టా తాగేసేవారట.

ఈ విషయాన్ని ఆయన సోదరుడు త్రివిక్రమ రావు ఓ సందర్భంలో ప్రస్తావించారు. ఇక ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చాక ఉదయం అరటికాయ, యాపిల్ పండ్లను తీసుకునేవారు. వ్యాయామం తర్వాత రెండు మూడు రకాల టిఫిన్లు ఆయన మెనూలో ఉండేవట. ఊతప్పం – దోసె – ఇడ్లీ – వడ ఆయన ఎక్కువగా ఇష్టపడేవారు. ఆయన టిఫిన్ లోకి చికెన్ గుజ్జుతో పాటు చికెన్ పకోడీ, ఫ్రై మటన్ నుంచి మేక కాళ్ళలోని మజ్జ ( ములుగు) నుంచి తీసిన పదార్థం ప్రత్యేకంగా తీసుకువచ్చి కూరగా చేసేవారట.

ఇవన్నీ కలిపి ఆయన టిఫిన్లో నంజుకుని తినేవారట. అలా ఉదయం 7:30 గంటలకు ఆయన టిఫిన్ ముగించి షూటింగ్ కి వెళ్లేవారట. ఇక షూటింగ్ కి వెళ్ళాక అవుట్ డోర్ షూటింగ్ ల్లో అయితే ఆయనను చూసేందుకు వచ్చే అభిమానులు క్యారేజ్‌లు తీసుకువెళ్లడం.. అటు ప్రొడక్షన్ హౌస్ వాళ్లు మద్రాస్ లోని పలు హోటల్స్ నుంచి రకరకాల వంటకాలతో క్యారేజీలు తెప్పించడం చేసేవారట.

ఎన్ని రకాల ఐటెంలు వచ్చినా కూడా ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా తినడంతో పాటు భోజనం తర్వాత లీటర్ కు తగ్గకుండా జ్యూస్ తీసుకునే వారట. ఇక మధ్యాహ్నం స్నాక్స్ కూడా గట్టిగా తీసుకునేవారని అప్పటి సినీ విశ్లేషకులు కథ‌లు క‌థ‌లుగా చెబుతూ ఉంటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news