Newsఆ టాలీవుడ్ హీరో సినిమాకు నో చెప్పి ఇప్పుడు నెత్తి నోరు...

ఆ టాలీవుడ్ హీరో సినిమాకు నో చెప్పి ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటోన్న ర‌ష్మిక‌…!

పుష్ప సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్ర‌ష్ క్రేజ్‌ సొంతం చేసుకుంది రష్మిక మందన్న. అయితే ఇప్పుడు రష్మిక పరిస్థితి గందరగోళంగా మారింది. ఆమె అనుకుందొకటి అయిందొక్కటి అన్న తరహాలో రష్మిక పరిస్థితి ఉంది. కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన రష్మిక తెలుగులో ఛ‌లో సినిమాతో ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆ తర్వాత విజయ్ దేవరకొండకు జోడిగా చేసిన గీతగోవిందం సినిమాతో అనూహ్య‌మైన క్రేజ్ తెచ్చుకుంది. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఏకంగా రష్మిక ద‌శ‌ మారిపోయింది. ఆమె బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అక్కడ చకచకా 3 – 4 సినిమాలు చేసినా అవేవీ ఆశించిన విజయాలు ఇవ్వలేదు. అయితే న‌టిగా రశ్మికకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దీంతో రెండు మూడు మంచి ఆఫర్లు కూడా రష్మిక‌కు వచ్చాయి.

అలా రణబీర్ కపూర్ సరసన యానిమల్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక షాహిద్ కపూర్ కి జోడిగా అవకాశం రావడంతో ఆమె ఎగిరి గంతేసింది. కేవలం ఈ సినిమా కోసమే టాలీవుడ్ టాప్ హీరో నితిన్ సరసన నటించే అవకాశం వదులుకుంది. నిజానికి నితిన్ – రష్మిక జంట భీష్మ‌ సినిమాతో సూపర్ హిట్ కొట్టి హిట్ ఫెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు షాహిద్ కపూర్ సినిమా బడ్జెట్ కారణంగా ఆగిపోయినట్టు తెలుస్తుంది.

దీంతో రష్మిక ఊహించింది ఒకటే అయితే మరొకటి జరిగింది. బాలీవుడ్ లో వెలిగిపోవాలని అత్యాశకు పోయి తెలుగులో తనకు మంచి హిట్ ఇచ్చిన నితిన్ సినిమా వదులుకుంది. ప్రస్తుతం రష్మిక హిందీలో యానిమల్, తెలుగులో పుష్ప 2 సినిమాల మీద ఆశ‌లు పెట్టుకుంది. అయితే రష్మిక బాలీవుడ్ వెంట పడడంతో తెలుగు ఇండస్ట్రీ అంతా ఇప్పుడు శ్రీలవైపు పరుగులు పెడుతుంది. అలా రష్మిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ చేజేతులా వదులుకున్నట్లు అయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news