News' ఖుషి ' క‌లెక్ష‌న్ల జోరు.. రికార్డుల హోరు... నోరు మూసుకోండ్రా...

‘ ఖుషి ‘ క‌లెక్ష‌న్ల జోరు.. రికార్డుల హోరు… నోరు మూసుకోండ్రా అంటూ స‌మంత వార్నింగ్‌..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ – యంగ్ క్రేజీ హీరోయిన్ సమంత కాంబినేషన్లో యువ దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఖుషి. సెప్టెంబర్ 1న డీసెంట్ బజ్‌ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖుషి సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలో అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఖుషి రు. 30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది.

ట్రేడ్ వర్గాలు 23 – 24 కోట్ల వసూళ్లు వస్తాయని అంచనా వేస్తే.. అంచనాలకు మించి ఖుషికి వసూళ్లు వచ్చాయి. ఇక అమెరికాలో అయితే అదిరిపోయే ర‌న్‌ కొనసాగిస్తూ చాలా ఫాస్ట్ గా వన్ మిలియన్ డాలర్ల క్లబ్బులోకి చేరిపోయింది. వీకెండ్ కంప్లీట్ కాకుండానే సినిమా ఈ రేంజ్ పెర్ఫామెన్స్ క‌నపరుస్తోంది అంటే త్వరలోనే ఖుషి అక్కడ రెండు మిలియన్ డాలర్ల క్లబ్ లోకి వెళ్ళిపోతుందని అంచనా వేస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది. ఇదిలా ఉంటే ఖుషి దెబ్బతో త‌న‌పై విమర్శలు చేసిన‌ తన హేటర్స్ అందరికీ ఆమె షాక్‌ ఇచ్చినట్లు అయింది. యశోద సినిమా అంచనాలు అందుకోలేకపోవటం.. పుష్ప సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్ పై తీవ్రమైన విమర్శలు రావడం.. ఇక శాకుంతలం అతిపెద్ద డిజాస్టర్ కావడంతో సమంత పని అయిపోయిందని ఆమె ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

తాజాగా ఖుషి సినిమాలో డీసెంట్ పెర్ఫార్మన్స్ తో ఆమె తనపై విమర్శలు చేస్తున్న వారందరికీ ఇక నోళ్లు మూసుకుంటారా ? అన్న రేంజ్ లో వార్నింగ్ ఇచ్చిందని.. కొంతకాలం గ్యాప్ తీసుకుని ఆమె తిరిగి సినిమాల్లోకి కం బ్యాక్‌ ఇవ్వటానికి రెడీగా ఉందని ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news