కోలీవుడ్ కి చెందిన అభినయ రవితేజ నేనింతే సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది .. మొదటి సినిమాలో చిన్న రోల్ కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు .. అయితే అదే రవితేజ నటించిన శంభో శివ శంభో సినిమాతో బాగా ఫేమస్ అయ్యిందీ అందాల బ్యూటీ .. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కూడా మహేష్ , వెంకటేష్ ల చెల్లిగా నటించి అందరి మనసులు గెలుచుకుంది .. ఇక వీటితోపాటు కింగ్, దమ్ము, ధ్రువ, సీతారామం, గామి వంటి టాలీవుడ్ సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది .. ఇక వీటితో పాటు మార్క్ ఆంటోని వంటి తమిళ్ సినిమాల తోను తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ..తెలుగుతో పాటు తమిళం ,కన్నడ సినిమాలోను నటిస్తూ బిజీగా ఉంటున్న అభినయ గురించి పలు ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి .. అవి ఏమిటంటే ఈ అందాల ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట . రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక ఫోటో కూడా షేర్ చేసి అందులో నిశ్చితార్థం జరుపుకున్నట్లు వంగరాలు మార్చుకుని గుడిగంటలు కొడుతున్న ఫోటోని తన అభిమానులతో పంచుకుంది . ఇక దాంతో అభినయకు కాబోయే భర్త ఎవరు ? అతను ఏం చేస్తాడు .. అతను బ్యాగ్రౌండ్ ఏంటి .. అనే విషయాలు తెలుసుకోవాలని నెటిజన్లు , అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు .. అయితే ఈ క్రమంలోని అభినయకు కాబోయే భర్త గురించి కొన్ని కీలక విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి .
ఇక అభినయకు కాబోయే భర్త పేరు కార్తీక్ . గత కొద్దిరోజుల క్రితం అతని పుట్టిన రోజు సందర్భంగా ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను కూడా అభినయ సోషల్ మీడియాలో షేర్ చేసింది .. హైదరాబాదుకు చెందిన కార్తీక్ ప్రముఖ బిజినెస్ మాన్ అని తెలుస్తుంది . ఇతను పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ..ఇక అభినయతో అతనికి 15 సంవత్సరాల నుంచే పరిచయముందని ఇద్దరు ప్రేమలో ఉన్నారని త్వరలోనే ఒకటి కాబోతున్నట్టు తెలుస్తుంది .. అయితే తమ ప్రేమ పెళ్లి గురించి అభినయ కానీ కార్తీక్ కాని ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన బయటికి చేయలేదు .