టాలీవుడ్‌లో నందమూరి ఫ్యామిలీ మధ్య వార్ కొనసాగుతుందంటూ ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణకు.. అన్నదమ్ములు ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ లకు మధ్యన కోల్డ్ వార్ జరుగుతుందని వీళ్ళ మధ్యన సక్యత లేదని.. ఓపెన్ గానే వార్తలు వైరల్ గా మారాయి. దానికి తగ్గట్టుకునే వీళ్ళు కూడా.. ఫ్యామిలీ ఫంక్షన్స్ లో సైతం ఎడమకం.. పెడముఖంగా కనిపించిన వీడియోలు, ఫోటోలు ఇప్పటికే ఎన్నోసార్లు వైరల్ అయ్యాయి. ఇలాంటి క్రమంలో కళ్యాణ్ రామ్.. తాజాగా నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా టీజర్ ఈవెంట్లో.. బాలయ్య గురించి చేసిన షాకింగ్ కామెంట్స్ నెటింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.
ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా టీజర్ ఈవెంట్లో.. కళ్యాణ్ రామ్ పాల్గొని సందడి చేశాడు. ఇందులో భాగంగా ఈయన బాలకృష్ణ , విజయశాంతిల గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా.. కళ్యాణ్ రామ్ , బాలయ్య ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ కు షాక్ ను కలిగిస్తున్నాయి. కళ్యాణ్ రామ్.. బాలయ్య గురించి మాట్లాడుతూ చిన్నప్పుడు బాలకృష్ణతో కలిసి బాలగోపాలుడు సినిమాలో నటించిన ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకున్నాడు . బాల బాబాయ్ తో కలిసి బాలగోపాలుడు సినిమాలో నటించిన సమయం ఇప్పటికీ గుర్తుందని .. ఆయన నుంచే నటనలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
బాబాయ్ ఎప్పుడు నాకు స్ఫూర్తి దాయకంగా ఉంటాడని .. ఆయన లెగిసిని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత మాపై ఉందంటూ ఆయన కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలో చాలా కాలం తర్వాత కళ్యాణ్ రామ్ .. బాలయ్య గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ కు షాక్‌ను కలిగిస్తున్నాయి . ఇప్పటివరకు కోల్డ్ వర్ కొనసాగుతుందనుకుంటున్నా నేపథ్యంలో.. కళ్యాణ్ రామ్ , బాలయ్య పై ప్రశంసలు కురిపిస్తూ బాల బాబాయ్ అంటూ ఆప్యాయత గా ఆయనపై చేసిన కామెంట్స్ తో నందమూరి ఫ్యాన్స్ ఆనందాని వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే వీళ్ళు కలిసిపోవాలని కామెంట్స్ చేస్తున్నారు.