సాయి పల్లవిని రొటీన్ కమర్షియల్ సినిమాల్లో మనం చూడలేమా ? మిగిలిన హీరోయిన్స్ అంతా అవకాశాల కోసం కొంత పట్టు విడుస్తున్నారు .. అనుపమ పరమేశ్వరన్ , కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు కూడా అవకాశాల కోసం గ్లామర్ షో కి ఓకే అంటున్నారు .. కానీ సాయి పల్లవి మాత్రం నో కాంప్రమైజ్ అంటుంది .. మరి కెరియర్ అంతా ఇలాగే ఉంటుందా .. లేక తర్వాత కమర్షియల్ సినిమాకు ఓకే అంటుందా.. ప్రజెంట్ సాయి పల్లవి ఇది పేరు కాదు బ్రాండ్ .. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవటమే కాదు .. తన కారణంగా సినిమాలు ఆడే స్థాయికి ఎదిగింది సాయి పల్లవి.
అలాగే ఈమె కెరియర్ మొదటి నుంచి తనదైన రూట్ లోనే వెళ్తుంది కానీ కమర్షియల్ సినిమా కోసం తన్ను తాను మార్చుకోవట్లేదు ఈ ముద్దుగుమ్మ .. ఇప్పటికీ నటనకు స్కోప్ ఉన్న పాత్రలోనే నటిస్తుంది. ఫిదా నుంచి మొదలుపెడితే ఇప్పటివరకు సాయి పల్లవి చేసిన సినిమాలు అన్నీ నటనకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్లే .. మధ్యలో ఎంసీఏ మాత్రమే రొటీన్ కమర్షియల్ సినిమా .. ఆ తర్వాత మళ్లీ అలాంటి పాత్రలు సినిమాల జోలికి వెళ్ళలేదు ఈ హీరోయిన్. ఇక గత సంవత్సరం అమరాన్ లో శివ కార్తికేయన్‌కు దీటుగా నటించింది సాయి పల్లవి ..ఇక ఇప్పుడు తాజాగా తండేల్ లోనూ నాగచైతన్యను డామినేట్ చేసి పడేసింది .. అలాగే తండేల్ సినిమాకు ఇంత క్రేజ్ రావడానికి నాగచైతన్యతో పాటు సాయి పల్లవి కూడా ఒక కారణం .. అదే విధంగా హిందీలో రామాయణ్ సినిమాలో సీతగా కూడా నటిస్తుంది ఈ హీరోయిన్. 2026 – 27 దీపావళికి రెండు భాగాలుగా రామాయణం రానుంది .. అంటే మరో రెండు మూడు సంవత్సరాల వరకు కూడా సాయి పల్లవి రొటీన్ కమర్షియల్ సినిమాల్లో చూడడం కష్టమే .. మొన్న జరిగిన తండేల్ ఈవెంట్ లో కూడా సందీప్ రెడ్డి వంగ ఇదే చెప్పారు. మరి భవిష్యత్తులో సాయి పల్లవి తన డిసిషన్కు కట్టుబడి ఉంటుందో లేదో చూడాలి.