Moviesతండేల్ రివ్యూ : సముద్రంలో చిక్కిన ప్రేమ ... తీరానికి ఎలా...

తండేల్ రివ్యూ : సముద్రంలో చిక్కిన ప్రేమ … తీరానికి ఎలా చేరింది ? హిట్టా? ఫట్టా ?

మూవీ : ‘తండేల్’

విడుదల తేదీ : ఫిబ్రవరి 07 , 2025

నటీనటులు : నాగ చైతన్య అక్కినేని, సాయి పల్లవి, దివ్య పిళ్ళై, ఆడుకాళం నరేన్, కరుణాకరన్

దర్శకుడు : చందూ మొండేటి

నిర్మాత :అల్లు అర‌వింద్‌

సంగీతం :దేవిశ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ : షామ్ దత్

ఎడిటర్ :నవీన్ నూలి

అక్కినేని హీరో నాగచైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ .. కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత దర్శకుడు చందు మొండేటి దగ్గర్నుంచి వస్తున్న సినిమా కావటంతో మూవీ పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి . అలాగే నాగచైతన్యకు జంట‌గా సాయి పల్లవి హీరోయిన్గా నటించింది .. అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు .. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ , ట్రైలర్ , పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి .. ఇక వాటికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో సినీ ప్రేక్షకుడికి ఈ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ కలిగింది .. గత కొన్ని సంవత్సరాలుగా అక్కినేని ఫ్యామిలీ హీరోల‌ సినిమాకు ఈ స్థాయిలో రిలీజ్‌కు ముందే పాజిటివ్ టాక్ రావడం కూడా ఇదే మొదటిసారి .. ఇక గత కొంతకాలంగా వరుస స్లాప్‌ల‌తో ఇబ్బంది పడుతున్న నాగచైతన్యకు ఈ సినిమా హిట్ ఇచ్చిందో లేదో అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.

తండేల్ లవ్ సాంగ్ రిలీజ్

కథ:
ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్రాకు చెందిన జాలరి చుట్టూ తిరిగే స్టోరీ తండేల్ .. చేపల వేటకు వెళ్లిన హీరోని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు .. పరాయి దేశంలో జైలు పాలైన తన ప్రియుడి రాక కోసం ప్రేయసి ఎదురుచూస్తూ ప్రేయసి ఎంతటి బాధ ఆవేదన అనుభవిస్తుంది అనేది తండేల్‌ సినిమా .. నిజ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనకు కొంత సినిమాటిక్ ఫ్లవర్ జోడించి తండెల్‌ను తెరకేక్కించారు .. ఎంతో గాఢంగా ప్రేమించుకున్న ఓ జంట అనూహ్యంగా దూరానికి గురవుతుంది .. ఇక ఈ ప్రేమికులు తిరిగి ఎలా కలుసుకున్నారు అనేది ఈ సినిమా అసలు స్టోరీ.

విశ్లేషణ:
ఇలాంటి కథలు మన టాలీవుడ్ లో ఎన్నో వచ్చాయి .. అయితే కథలో వైవిధ్యాన్ని చూపించడంలో దర్శకుడు విజయం సాధించాడు .. ఇక సినిమా మొదటి భాగంలో నాగచైతన్య , సాయి పల్లవి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి .. అలాగే చాపల వేటకు వెళ్తే ఎలా ఉంటుందో చేపల పెట్టేవారు సముద్రంలో ఎలా ఉంటారో అనేవి కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకుడు .. ఊహించని ఇంటర్వెల్ ట్విస్ట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు .. ఇక సెకండాఫ్లో మెయిన్ పాయింట్ లోకి వెళ్తాడు .. అయితే ఈ క్రమంలోనే దర్శకుడు కాస్తత తడపడినట్టు కనిపించింది .. అయితే మళ్లీ తిరిగి పుంజుకుని చివరి 20 నిమిషాలను ఎంతో అద్భుతంగా ప్రేక్షకులకు చూపించాడు.

Thandel Movie (Feb 2025) - Trailer, Star Cast, Release Date | Paytm.com

నటీనటుల పర్ఫామెన్స్ :
నాగచైతన్య ఇప్పటివరకు లవర్ బాయ్ గానే చూసిన అభిమానులకు తనలోని మరో యాంగిల్ ని ఈ సినిమాతో పరిచయం చేశాడు .. చాపల వేటకు వెళ్లే మత్స్యకార యువకుడిగా , ప్రేమికుడుగా , జాలరి గ్యాంగ్ నాయకుడి గా .. పాకిస్తాన్లో దొరుకుపోయిన జాలరి ఇలా భిన్నమైన యాంగిల్ లో తన క్యారెక్టర్ లో వేరియేషన్ చూపిస్తూ తన నటనతో మెప్పించాడు. అలాగే పాకిస్తాన్ జైల్లో తన ప్రేయసి కోసం బాధపడే సన్నివేశాల్లో నాగచైతన్య ఎంతో అద్భుతంగా నటించారు .. కొన్ని కొన్ని సన్నివేశాల్లో నాగచైతన్య నటనకు కంటతడి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి .. ఇక బుజ్జి తల్లిగా సాయి పల్లవి నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. పాకిస్తాన్లో దొరుకుపోయిన తన ప్రియుడు కోసం ఎదురుచూసే పాత్రలో సాయి పల్లవి మరోసారి మెప్పించారు మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు నటించారు.Thandel (@thandelthemovie) • Instagram photos and videos

టెక్నికల్ :
ఇక తండేల్‌ సినిమాకి ప్రధానంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ వెన్నుముక్కగా నిలిచారు .. ఈ రీసెంట్ టైమ్స్ లో దేవిశ్రీప్రసాద్ నుంచి వచ్చిన బెస్ట్ ఆల్బమ్ కూడా ఇదే .. ఇక దర్శకుడుగా చందు మొండేటి మరోసారి తన మ్యాజిక్ ను చూపించార‌నే చెప్పాలి ..కార్తికేయ 2 తర్వాత అతను దర్శకత్వం వహించిన సినిమా కూడా ఇదే .. అయితే మొదటి భాగాన్ని అద్భుతంగా తెర్కక్కించిన డైరెక్టర్ సెకండాఫ్ వచ్చేసరికి కథను సరిగ్గా ముందుకు తీసుకెళ్లడంలో కాస్త తడబడ్డాడు .. అయినా కూడా చివరి 20 నిమిషాల్లో సినిమాను ఎంతో అద్భుతంగా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు .. ఇక ఈ సినిమాకి నిర్మాణ విలువలు కూడా ఎంతో రీచ్ గా ఉన్నాయి .. కెమెరా పనితనం కూడా బాగుంది.

Thandel Movie : 'తండేల్ ' కు కనీస ఓపెనింగ్స్ కూడా కష్టమేనా..? -

చివరి పంచ్: అక్కినేని హీరో నాగచైతన్యకు ఇక రాజులమ్మ జాతరే..

రేటింగ్: 3

Latest news