సంవత్సరానికి రెండు సినిమాల చేయడానికి మేం రెడీ అంటున్నారు స్టార్ హీరోలు . అయితే ఇలా చాలామంది హీరోలు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కానీ ఇది వారు చెప్పినంత ఈజీనా ? ఇప్పుడు నిజంగానే మన స్టార్ హీరోలు ఏడాదికి రెండు సినిమాలు చేయగలరా ? ఇది పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఒక్కడికే సాధ్యమవుతున్న ఈ ఫీట్ను మిగిలిన వాళ్ళు చేసి చూపించగలరా ? వారికి సాధ్యమవుతుందా లేదా అనేది ఈ ఎక్స్ క్లోజ్ స్టోరీలో తెలుసుకుందాం. ప్రస్తుతం నడుస్తున్న పాన్ ఇండియా ట్రెంట్‌లో స్టార్ హీరోల నుంచి ఏడాదికి ఒక సినిమా రావటమే కష్టంగా మారిపోయింది .. ఇంకా చెప్పాలంటే రెండు మూడు సంవత్సరాలకు ఒక్కో సినిమా చేస్తున్నారు మన హీరోలు .ఇలాంటి సమయంలో సంవత్సరానికి రెండు సినిమాలు అనే కాన్సెప్ట్ అసాధ్యం .. పైగా అందరూ పాన్ ఇండియా హీరోలు అయిపోయారు.. బడ్జెట్ భారీగా పెంచేస్తున్నారు అందుకే వర్కింగ్ డేస్ కూడా భారీగా పెరగబోతున్నాయి. పాన్ ఇండియా హీరోల్లో ఒక ప్రభాస్ మాత్రమే వేగంగా సినిమా చేసుకుంటూ పోతున్నాడు .. ఈ సంవత్సరం రాజా సాబ్ రిలీజ్ కానుంది .. అలాగే హను రాఘవపూడి ఫౌజి కూడా తక్కువ గ్యాప్‌లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే ఈ రెండు సినిమాలు ఈ సంవత్సరం వస్తాయి. అలాగే సలార్ 2, కల్కి 2, స్పిరిట్ లాంటి సినిమాలు కూడా లైన్ లోనే ఉన్నాయి .. ఇవన్నీ రాబోయే రెండు సంవత్సరాలలో విడుదల కాబోతున్నాయి ..
ఇలా ప్రభాస్ చేసినట్లే తాము కూడా వేగంగా సినిమాలు చేయాలని మిగిలిన హీరోలు కూడా చూస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ ముందు వరుసలో ఉన్నారు. గేమ్ చేంజర్ కోసం ఏకంగా మూడేళ్లు సమయం తీసుకున్న ఈ హీరో .. బుచ్చిబాబు సినిమాను కేవలం 6 నెలల్లో పూర్తి చేయాలని చూస్తున్నాడు .. అలాగే డిసెంబర్లోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు .. ఆ తర్వాత సుకుమార్ సినిమాను కూడా ఇంతే వేగంగా కంప్లీట్ చేయాలని ప్లాన్ లో ఉన్నాడు. మరో పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ సైతం వార్ 2 తో ఆగస్టులో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు .. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా రెడీగా ఉంది .. వీటితోపాటు దేవర 2 కూడా లైన్లోనే ఉంది .. వీటిని కేవలం రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాడు ఎన్టీఆర్ .. అయితే అల్లు అర్జున్ మాత్రం త్రివిక్రమ్ సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాలు కావాలంటున్నారు సీనియర్స్‌లో చిరు , బాలయ్య మాత్రం ఏడాదికి రెండు సినిమాలు లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నారు.
ప్రభాస్ బాటలో స్టార్ హీరోలు.. ఇది వారికి సాధ్యమేనా..?
