Movies` తండేల్‌ ` ట్విట్ట‌ర్ రివ్యూ.. చైతూ హిట్ కొట్టాడా?

` తండేల్‌ ` ట్విట్ట‌ర్ రివ్యూ.. చైతూ హిట్ కొట్టాడా?

భారీ అంచనాల నడుమ నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ` తండేల్‌ ` మూవీ నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌ చందు మొండేటి తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా రివ్యూలు ఇచ్చేస్తున్నారు. మెజారిటీ పీపుల్‌ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభిస్తుంది.Thandel Movie - 'తండేల్‌' జోరు మామూలుగా లేదు - బుక్‌ మై షోలో ట్రెండింగ్‌లో  నిలిచిన చిత్రం!స్టోరీ విషయానికి వస్తే.. శ్రీకాకుళం కి చెందిన కొందరు జాలర్లు సముద్రంలో వేట‌కు వెళ్లి అనుకోకుండా పాకిస్థాన్ వాటర్స్ లోకి ప్రవేశించి ఆ దేశ పోలీసులకు చిక్కుతారు. ఆ త‌ర్వాత పాకిస్థాన్ జైలులో సంవత్సరం పాటు మ‌గ్గిపోయిన జాల‌ర్లు ఎలా తిరిగి తమ దేశం చేరుకున్నారు అన్న‌దే క‌థ‌. అయితే తండేల్ చూసిన ఆడియెన్స్‌.. ఫ‌స్టాఫ్ యావ‌రేజ్, సెకండాఫ్ మాత్రం సినిమాకు ప్రాణం పోషింద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఫస్ట్ హాఫ్ లో మొత్తం లవ్ స్టోరీ ని చూపించిన డైరెక్ట‌ర్‌.. ఇంటర్వెల్ నుండి అసలు కథ లోకి వెళ్లాడ‌ని చెబుతున్నారు.Thandel movie February 7 - Tolly Guns

అలాగే మత్స్యకారుడు రాజు పాత్ర‌లో నాగ‌చైత‌న్య‌, స‌త్య పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి అద‌ర‌గొట్టేశార‌ట‌. ముఖ్యంగా నాగచైతన్య యాక్టింగ్ సూపర్‌గా ఉందంటున్నారు. అత‌ని భాష‌, యాస చాలా న్యాచుర‌ల్ గా ఉన్నాయ‌ని.. కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడ‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. సాయిపల్లవి మరోసారి న‌ట‌న‌తో పాటు డ్యాన్స్ ఇర‌గ‌దీసింద‌ని అంటున్నారు. సినిమాకు డీఎస్పీ అందించిన మ్యూజిక్ మ‌రో బ‌లంగా నిలిచిందని అభిప్రాయ‌పడుతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న ఈ మూవీ కోసం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా టాప్ ట్రెండింగ్ లో వున్నాయి.Naga Chaitanya and Sai Pallavi's Thandel to release early next year - India  Todayఇక ప్రీమియ‌ర్స్ చూసిన జ‌నాలు ప్ర‌త్యేకంగా డీఎస్పీని అభినందిస్తున్నారు. మొదటి సీన్ నుండే తన మ్యూజిక్ తో ప్రేక్షకులని కట్టి పడేశాడ‌ట‌ని అంటున్నారు. సాంగ్స్ సినిమాకు బ్యాక్ బోన్‌గా నిలిచాయ‌ట‌. కానీ స్లో నేరేషన్ పెద్ద మైన‌స్ అంటున్నారు. హీరో, హీరోయిన్లు త‌ప్పా మిగ‌తా న‌టీన‌టుల‌కు డ‌బ్బింగ్ సెట్ అవ్వ‌లేదంటున్నారు. ఎలివేష‌న్స్‌, ఎమోష‌న్స్ బాగా పండినా.. కొన్ని సీన్లు మాత్రం విసిగుతెప్పిస్తాయ‌ని.. రైటింగ్ కూడా కొంచెం వీక్ గా ఉంద‌ని చెబుతున్నారు. అయితే మెజారిటీ ఆడియెన్స్ నుంచి మాత్రం తండేల్ బ్లాక్ బ‌స్ట‌ర్ అనే అభిప్రాయం వెల్ల‌డ‌వుతోంది. చైతూ హిట్ కొట్టాడ‌ని.. ఐదేళ్ల త‌ర్వాత అత‌నికి తండేల్ కంబ్యాక్ మూవీ అవుతుంద‌ని ఫ్యాన్స్ కూడా ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

Latest news