నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లెటెస్ట్ స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకూ మహారాజ్. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాలయ్య ఖాతాలో వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. ఈ సినిమా తాజాగా 25 రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ చేసుకుంది. రు. 175 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా రు. 90 కోట్ల షేర్ రాబట్టింది.డాకూ మహారాజ్ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రు. 83 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. రు. 90 కోట్ల షేర్ రావడంతో డాకూ సినిమాకు ఇప్పటికే రు. 7 కోట్ల లాభం వచ్చినట్లయ్యింది. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు లాభాల్లోకి వచ్చేసింది. సితార ఎంటర్టన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ, దర్శకుడు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు కొల్లు బాబి దర్శకత్వం వహించారు.
25 రోజుల డాకూ మహారాజ్.. 175 కోట్ల గ్రాస్ … రు. 90 కోట్ల షేర్…!
