టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా గత ఏడాది చివరిలో వచ్చిన దేవర సినిమా బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేసింది. సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినా కూడా భారీ కలెక్షన్లు వచ్చినాయి. ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఈ క్రమంలోనే దేవర సీక్వెల్ దేవర 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే దేవర 2 పై అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం దేవర పార్టు స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్క్రీన్ ప్లే .. కీలక సన్ని వేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ తన టీం తో గత కొన్ని వారాలుగా వర్క్ చేస్తున్నాడు.ఈ యేడాది నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో ఈ వార్త వైరల్ గా మారింది. ఈ ఒక్క న్యూస్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఇక పండగే పండగ అని చెప్పాలి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ ఆలీఖాన్ కీలకల పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. అలాగే శ్రీకాంత్ – ప్రకాష్ రాజ్ – అజయ్ – మురళీ శర్మ ఇతర కీలక పాత్రలలో నటించారు. తాజాగా వార్ 2 షూటింగ్ పూర్తిచేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో చేసే సినిమాపై దృష్టి పెట్టారు.
‘ దేవర 2 ‘ బిగ్ బ్రేకింగ్ అప్‌డేట్ ఇది.. ఎన్టీవోడి ఫ్యాన్స్‌ను ఇక అస్సలు ఆపలేం..!
