టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా తర్వాత.. రెండు తెలుగు రాష్ట్రాలలో సినీ ప్రేమికులు ఆ స్థాయిలో బ్రహ్మరథం పడుతున్న సినిమా.. అలాగే విపరీతంగా ఎంజాయ్ చేస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది సంక్రాంతికి వచ్చిన.. సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పాలి. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కి స్ట్రాంగ్ బేస్ అయిన.. ఫ్యామిలీ ఎంటర్టైరర్ జానర్ లో ఈ సినిమా తెరకెక్కింది.టాలీవుడ్ లో తొలి సినిమా పటాస్ నుంచి అసలు అపజయం అన్నది లేకుండా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా సంక్రాంతికి మూడు పెద్ద సినిమాల పోటీ మధ్యలో రిలీజ్ అయ్యి కూడా.. అన్ని సినిమాలను దాటుకుని బాక్సాఫీస్ దగ్గర రురుకుల పరుగులు పెడుతోంది. ఊహించని వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రికార్డులు సెట్ చేస్తోంది. కేవలం ఐదు రోజులలో రూ.160 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసిన ఈ సినిమా ఇప్పుడు ఈజీగా రూ.200 కోట్ల మార్కు కూడా దాటేయనుంది.
ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. వెంకీ మామ సెన్సేషనల్ గా లాంగ్ రన్‌లో ఈ సినిమాతో రూ.300 కోట్ల క్లబ్లో జాయిన్ అవుతాడని కూడా టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సంక్రాంతి నుంచి మొదటి వీకెండ్‌కే సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ.200 కోట్ల గ్రాస్ కొట్టేస్తుందని అందరూ అనుకున్నారు. ఇక సోమవారం బుకింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. మంగళవారం కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది.
లాంగ్ రన్‌లో ఈ సినిమా రూ.300 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇక యావరేజ్ చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం ప్రతిరోజు వరల్డ్ వైడ్ గా రూ.30 కోట్లకి పైగా గ్రాస్ రాబడుతోంది.
టాలీవుడ్‌లో ఎంత తోపు హీరోకు లేని రికార్డు కొట్టబోతోన్న వెంకీ మామ…!
