నందమూరి బాలకృష్ణకు ప్రస్తుతం పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలామంది ఆయనకు శుక్ర మహర్దశ నడుస్తోంది అంటున్నారు. అసలు 2021లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించిన అఖండ సినిమాకు ముందు వరకు.. బాలయ్యకు నాలుగైదు ఫ్లాప్‌లు పడితే ఒక హిట్టు వచ్చేది. అంతకుముందు ఆయనకు గౌతమీపుత్ర శాతకర్ణి హిట్ సినిమా. మధ్యలో జై సింహ తడబడుతూ బ్రేక్‌ఈవెన్ అయింది. ఇక 2021లో వచ్చిన అఖండ తర్వాత బాలయ్యకు తిరుగులేదు. అక్కడి నుంచి ఆయనకు వరుసగా నాలుగు హిట్లు పడ్డాయి.ప్రతి సినిమాకు రెమ్యూనరేషన్ పెరుగుతూ వెళుతుంది. అఖండ సినిమాకు ముందు వరకు బాలయ్య రూ.6 కోట్ల వరకు తీసుకునేవారు. అఖండ సినిమాకు రూ.8 కోట్లు ఇచ్చారు. వీర సింహారెడ్డి సినిమాకు ముందు రూ.8 కోట్లు అనుకుని.. చివరకు రూ.12 కోట్లు ఇచ్చారు. భగవంత్ కేసరి సినిమాకు బాలయ్య రూ.18 కోట్లు తీసుకున్నారని సమాచారం. ఇక తాజాగా డాకు మహారాజ్ సినిమా కోసం రూ.27 కోట్లకు ఒప్పందం జరిగినట్టు వార్తలు వచ్చాయి.
ఇక మరోసారి బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న అఖండ 2 సినిమాకు రూ.35 కోట్లకు కాస్త అటు ఇటుగా రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి బాలయ్యకు రూ.40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారని సమాచారం. ఏది ఏమైనా సీనియర్ హీరోలలో చిరంజీవి తర్వాత బాలయ్య అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. నాగార్జున, వెంకీ రెమ్యునరేషన్ ఇప్పటికీ పది కోట్లు దాటని పరిస్థితి ఉంది.
ఆ సినిమాకు బాలయ్య రెమ్యునరేషన్.. అక్షరాలా రు. 40 కోట్లు…!
