సూపర్ స్టార్ మహేష్ బాబు అంటేనే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది అందం .. ఇప్పటివరకు ఆయన ఒక్కసారి కూడా ఆయన్ను డి గ్లామర్ లుక్ లో చూడలేదు .. అలా నటించిన కూడా ఆయన్ను చూసి ప్రేక్షకులు ఒప్పుకోరు .. ఎందుకంటే సగం మంది ప్రేక్షకులు మహేష్ ని చూడటం కోసం థియేటర్‌కు వస్తారు అందుకే దర్శకులు కూడా ఈ విషయంపై ఎంతో క్లారిటీగా ఉంటారు .. అందుకే తెరమీద మహేష్‌ను ఎంతో అందంగా చూపించడానికి ఇష్టపడతారు .. కానీ ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం మహేష్ బాబు కి ఇప్పుడు ఊహించని టఫ్ సిచువేషన్ ఎదురవుతుందట .. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ..ప్రజంట్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .. రాజమౌళి సినిమా అంటేనే హీరోలకు మామూలు కష్టం ఉండదు ..అలాగే ఆ సినిమాపై అంచనాలు కూడా ఊహించని రేంజ్ లో ఉంటాయి .. ఇప్పుడు అందులోనూ మహేష్ తో సినిమా అంటే అభిమానుల అంచనాలు పిక్స్ లో ఉన్నాయి .. ఇక దీంతో ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేస్తుందని అంటున్నారు .. అటు మహేష్ అభిమానులతో పాటు రాజమౌళి అభిమానులు కూడా గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు .. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మహేష్ బాబు చేత ఇప్పటివరకు ఆయన చేయని ఎన్నో విన్యాసాలు చేయించబోతున్నారట రాజమౌళి.
ఇక రీసెంట్గా వైరల్ అవుతున్న మేటర్ ఏమిటంటే .. ఈ సినిమాలో ఒక 20 నిమిషాల వైల్డ్ ఫెయిర్ ఎటాక్ సన్నివేశం ఉంటుందట .. ఆ సన్నివేశానికి మొత్తం థియేటర్స్ మొత్తం దద్దరిల్లిపోతాయట .. అంతేకాకుండా ఈ సీన్ కోసం జాజిమౌళి ఎలాంటి డూప్ లేకుండా నిజమైన మంటల్లో మహేష్ ను నటింప చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారట.. అయితే మొదట మహేష్ నో చెప్పినప్పటికీ సీన్ గురించి క్లియర్ ఎక్స్ ప్లైన్ చేయటంతో ఒకే అంటూ హామీ ఇచ్చారట .. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఇదే వార్త వైరల్ గా మారింది.