టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్‌లు అభిమానులను చాలా ఆసక్తిగా ఆకట్టుకుంటాయి. అలాంటి వారిలో దర్శకుడు హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఒకటి. వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్‌సింగ్ సినిమా పెద్ద హిట్ అయ్యింది. చాలా యేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్‌కు ఇది సాలీడ్ హిట్ పడింది. ఇప్పుడు వీరి కాంబోలో మరోసారి ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా కూడా రానుంది. త్వరలోనే ఇది సెట్స్ మీదకు వెళ్లనుంది.ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా కూడా ఎనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు దర్శకుడు హరీష్ శంకర్ ఎంతో ప్రయత్నిస్తున్నాడు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లడం కష్టంగానే ఉంది. ఓజీ – హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్ పూర్తయ్యాకే ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ మీదకు వెళుతుంది.
ఇప్పటికే పవన్ కోసం వెయిట్ చేయలేక హరీష్ శంకర్ రవితేజతో మిస్టర్ బచ్చన్ షూటింగ్ పూర్తి చేయడం.. రిలీజ్ అవ్వడం కూడా జరిగిపోయింది. పవన్‌తో సినిమా ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఈ క్రమంలోనే హరీష్ శంకర్ ఈ లోగా బాలయ్యతో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు టాక్ ? అసలు నిజంగా ఇప్పుడు బాలయ్య ఉన్న ఫామ్ నేపథ్యంలో హరీష్ శంకర్‌తో సినిమా చేస్తే.. ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఉండే క్రేజ్ అయితే మామూలుగా ఉండదు.
పవన్ అవుట్… బాలయ్య ఇన్… ఆ డైరెక్టర్‌తో సినిమా ఫిక్స్… !
