ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన భారీ యాక్షన్ సినిమా డాకు మహరాజ్. ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవుతోంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు పోటీగా వస్తోన్న ఈ సినిమా పై అంచనాలు మామూలుగా లేవు. ఇక డాకూ మహారాజ్ సినిమాకు దర్శకుడు కొల్లి బాబి దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా వచ్చిన ట్రైలర్ తర్వాత సినిమాపై హైప్ మామూలుగా లేదు.ఇక నందమూరి అభిమానుల తో పాటు టాలీవుడ్ సినీ లవర్స్‌ను ఓ రేంజ్‌లో ఈ సినిమా ఎగ్జైట్ చేస్తోంది. ఇదిలా ఉంటే బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమా కోసం ఆరేళ్లుగా తెలుగు సినీ అభిమానులు ఎంతో ఎగ్జైట్మెంట్‌తో వెయిటింగ్‌లో ఉన్నారు. ఎట్టకేలకు ఊరిస్తూ ఊరిస్తూ వచ్చిన మోక్షు డెబ్యూ సినిమా హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కొద్ది నెలల క్రితం స్టార్ట్ అయ్యింది.
అయితే ఆ వెంటనే ఈ సినిమా ఆగిపోయిందని.. రకరకాల పుకార్లు వస్తున్నాయి. ఈ పుకార్లపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా ఆగిపోలేదు. వచ్చే ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు వెళుతుంది. ఇది నిజంగానే నందమూరి అభిమానులకు అదిరిపోయే న్యూస్ అని చెప్పాలి. ఈ చిత్రానికి ఎస్ ఎల్ వి సినిమాస్ వారు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.
మోక్షజ్ఞ మోస్ట్ అవైటెడ్ సినిమాపై మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్..!
