ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వస్తున్న సినిమాలలో.. మెగా ఫ్యామిలీ హీరో… టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ, అంజలీ హీరోయిన్లుగా నటిస్తోన్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు వస్తోన్న వేళ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్ర పోషించిన కోలీవుడ్ దర్శకుడు.. విలక్షణ నటుడు ఎస్.జె సూర్య చేసిన లేటెస్ట్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.ఓ ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ సినిమాకు రు. 400 – 500 కోట్ల బడ్జెట్ నిర్మాత దిల్ రాజు పెట్టినట్టు చెప్పారు. ఈ బడ్జెట్ విషయం బయటకు వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఇక ఈ సినిమాకు ఏపీ సహా తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి రు. 130 కోట్లకి పైగా ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే రు. 130 కోట్ల టార్గెట్ తో రాబోతుంది.
ఇందులో ఒక్క నైజాం నుంచే 37 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇక ఆంధ్రలో రు. 70 కోట్లు .. సీడెడ్ నుంచి 20 కోట్లకి పైగా బిజినెస్ చేసిందట. ఇక వరల్డ్ వైడ్ ఈ సినిమా రు. 250 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే రు. 450 కోట్ల రేంజ్ గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. మరి ఈ మొత్తం టార్గెట్ గేమ్ ఛేంజర్ కొడుతుందో లేదో వేచి చూడాలి. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
‘ గేమ్ ఛేంజర్ ‘ బడ్జెట్… వరల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ లెక్కలివే… !
