టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే సమ్మర్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాను కళ్యాణ్‌రామ్‌తో బింబిసార సినిమా తెరకెక్కించిన యువ దర్శకుడు మల్లిడి వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత చిరు నటిస్తోన్న ఈ సోషియో ఫాంటసీ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.విశ్వంభర తర్వాత చిరంజీవి నానితో దసరా సినిమా తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తన ఖాతాలో వరుసగా ఎనిమిదో హిట్ వేసుకున్న అనిల్ రావిపూడి తో కూడా చిరు ఓ సినిమా చేయనున్నారు.
ఈ మూడు సినిమాల తర్వాత చిరు మరోసారి తన వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీతో కూడా చిరంజీవి సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చిన డాకు మహారాజ్ సినిమాలో బాలయ్యను సరికొత్తగా ప్రజెంట్ చేశాడు బాబీ. ఈ సినిమా లో బాలయ్యను చాలా స్టైలీష్ గా చూపించి హిట్ కొట్టాడు. దీంతో ఇప్పుడు మరోసారి చిరు.. బాబితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ ? ఏదేమైనా చిరు నెక్ట్స్ లైనప్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉందనే చెప్పాలి.