టాలీవుడ్ స్టైలీష్ స్టార్ … ఐకాన్ స్టార్ అల్లు అర్జు్న్ నటించిన లేటెస్ట్ సినిమా ‘ పుష్ప 2 ’ . ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరం చూశాం. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరుకు ఇండియన్ సినీ జనాలు ఫిదా అయిపోయారు. మాస్ జనాలకు మాంచి కిక్ ఇచ్చేలా ఈ సినిమా ఉండడంతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అందరూ ఈ సినిమాకు పట్టం కట్టారు. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత బన్నీ నటిస్తోన్న తర్వాత సినిమాలపై ఇండియన్ సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే బన్నీ నెక్ట్స్ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రినివాస్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ సినిమా తర్వాత బన్నీ – కొరటాల కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతోంది. కొరటాల గత యేడాది జూనియర్ ఎన్టీఆర్ తో దేవర సినిమా తెరకెక్కించి పాన్ ఇండియా హిట్ కొట్టాడు.
ఇప్పుడు దేవర 2 సినిమా మీద వర్క్ చేస్తాడు. ఆ తర్వాత బన్నీ సినిమా కోసం కసరత్తులు మొదలు పెడతాడు. అసలు గతంలో కొరటాల శివ తో బన్నీ ఓ సినిమా చేయాల్సి ఉన్నా ఆ ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. ఇప్పుడు పుష్ప 1, పుష్ప 2 సినిమాలతో బన్నీకి పాన్ ఇండియా క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడు కొరటాల కూడా బన్నీతో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తే కొరటాలకు కూడా పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ పక్కా. అందుకే కొరటాల బన్నీతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కోసం కసరత్తులు మొదలు పెట్టేశాడట.
బన్నీ – కొరటాల సినిమా వెనక ఇంత పెద్ద స్కెచ్ ఉందా..!
