Movies' సంక్రాంతికి వస్తున్నాం ' ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌... పాన్ ఇండియా...

‘ సంక్రాంతికి వస్తున్నాం ‘ ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌… పాన్ ఇండియా సినిమాల‌కే షాక్ ఇచ్చే రికార్డ్స్‌..!

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాల మ‌ధ్య‌లో పోటీగా వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగిస్తూ దూసుకు పోతోంది. ఈ సినిమానుద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయ‌గా… ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫ‌స్ట్ వీక్ ముగిసేస‌రికి క‌ళ్లు చెదిరే వ‌సూళ్లు కొల్ల‌గొడుతోంది.Sankranti ki Vastunnam - Pakka Teluguసంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాకు అన్ని చోట్లా ప్రేక్ష‌కులు ఓ రేంజ్‌లో బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఫ‌స్ట్ వీక్ ముగిసే సరికి వెంకీ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఏకంగా రూ.203 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి దుమ్ములేపింది. అందులోనూ ఆరు రోజుల‌కే ఏకంగా రు. 100 కోట్ల షేర్ వ‌చ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ టార్గెట్ కేవ‌లం రు. 30 కోట్లే.. అంటే ఏ స్థాయిలో లాభాలు వ‌చ్చాయో అర్థం చేసుకోవ‌చ్చు.అన్నింటికి మించి ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రానికి ఈ స్థాయిలో వసూళ్లు వస్తుండటం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. పాన్ ఇండియా సినిమాల‌ను మించిన వ‌సూళ్లు ఈ సినిమా సాధించింది. ఈ సినిమాలో వెంకీకి జోడీగా అందాల భామలు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా భీమ్స్ ఈ మూవీకి సంగీతాన్ని అందించాడు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.

Latest news