నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సినిమా డాకూ మహారాజ్. సంక్రాంతి బరిలో నిలిచిన డాకూ ఇప్పటికే రు. 100 కోట్ల వసూళ్లు దాటేసి బ్లాక్ బస్టర్ బొమ్మగా నిలిచింది. మాస్‌కు మంచి కిక్ ఇస్తోన్న ఈ సినిమా కంప్లీట్ ఫ్యూర్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా నిలిచింది. దర్శకుడు కొల్లి రవీంద్ర ( బాబి) డైరెక్ట్ చేసిన ఈ సినిమా లో బాలయ్య పెర్పామెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
మిగిలిన సంక్రాంతి సినిమాలకు ధీటుగా డాకూ మహారాజ్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే డాకూ మహారాజ్ సినిమా విజయోత్సవ సభలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌పై హీరో నందమూరి బాలకృష్ణ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక థమన్ ప్రతిసారి బాలయ్య సినిమాలకు ఇచ్చే మ్యూజిక్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందనడంలో సందేహం లేదు.బాలయ్య గత నాలుగు సినిమాలకు థమన్ ఏ రేంజ్‌లో మ్యూజిక్ ఇస్తున్నాడో చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే థమన్‌ను అందరూ నందమూరి థమన్ అంటారని… అయితే ఇకపై అలా అనొద్దు… NBK థమన్ అని పిలవాలని బాలయ్య కోరారు. తన సినిమాలకు థమన్ ఎంతలా ఎఫర్ట్ పెడతాడో బాలయ్యకు కూడా తెలుసు. ఈ క్రమంలోనే తనపై .. తన సినిమాలపై థమన్ చూపించే ఈ స్పెషల్ ఇంట్రస్ట్ నేపథ్యంలోనే బాలయ్య ఈ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది.