Moviesచరణ్-బాలయ్య-వెంకటేష్.. ఈసారి సంక్రాంతి రియల్ హీరో ఎవరో తెలిసిపోయిందిగా..!

చరణ్-బాలయ్య-వెంకటేష్.. ఈసారి సంక్రాంతి రియల్ హీరో ఎవరో తెలిసిపోయిందిగా..!

అయిపోయింది ..సంక్రాంతి పండుగ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది . కాగా సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించిన టాక్ ఇప్పుడు వైరల్ గా మారింది. మనకు తెలిసిందే సంక్రాంతి రేస్ అంటే కచ్చితంగా బడా బడా సినిమాలు ఉంటాయి . పెద్ద హీరోలు కూడా ఆ లిస్టులో ఉంటారు . ప్రతి సారి కూడా పెద్ద హీరోలే ఆ రేస్ లో విన్ అవుతూ ఉంటారు. కాగా ఈ మధ్యకాలంలో ట్రెండ్ మారిపోయింది . పెద్ద హీరోల సినిమాలు హిట్ అవ్వడం కాదు ..కధా.. కంటెంట్ ఏ సినిమాలో బాగుంటే అదే హిట్ అవుతుంది. పోయినసారి ‘గుంటూరు కారం’,’హనుమాన్’ సినిమాలో తేజ సజ్జా నటించిన ‘హనుమాన్’ సినిమా హైలెట్గా మారింది .

సంక్రాంతి రేసులో విన్నర్ గా నిలిచింది . కాగా ఈ సంవత్సరం సంక్రాంతి రేసులో విన్నర్ గా ఎవరు నిలిచారు అనే విషయాన్ని ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు సినీ ప్రేమికులు . మొదట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన’గేమ్ చేంజఋ సినిమాకి సంబంధించిన టాక్ వైరల్ గా మారింది . భారీ ఎక్స్పెక్టేషన్స్ తో అంతకన్నా భారీ బడ్జెట్ తో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 10వ తారీకు రిలీజ్ అయింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది . కూసింత నెగిటివ్ ట్రోలింగ్ కూడా జరుపుకుంది . కలెక్షన్స్ పరంగా కుమ్మేస్తున్న టాక్ మాత్రం ఫుల్ నెగిటివ్గా మారిపోయింది .దీంతో సంక్రాంతి రేసులో ఫ్లాప్ అయిపోయాడు రామ్ చరణ్ . ఆ తర్వాత వచ్చిన ‘డాకు మహారాజ్’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . బాలయ్య లోని వైల్డ్ యాంగిల్ ని చాలామంది ప్రశంసించారు . మరి ముఖ్యంగా ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన విధానం చూసి షాక్ అయిపోయారు . తమన్ ఇంత బాగా మ్యూజిక్ అందించగలడా అంటూ కామెంట్స్ కూడా వినిపించాయి . కాగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి రేసులో విన్ అయింది . ఇక ఆ తర్వాత వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సూపర్ సక్సెస్ అయింది. అయితే బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాల మధ్య ఇప్పుడు విన్నర్ ఎవరు అనే విషయం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు జనాలు . అయితే సినిమా టాక్ ప్రకారం రెండు బాగున్నాయి. ఒకటి యాక్షన్.. ఒకటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే కలెక్షన్స్ పరంగా చూస్తే మాత్రం ‘డాకు మహారాజు’ ఎవరు టచ్ అయిలేని హై స్థాయిలో ఉంది . దీంతో సంక్రాంతి విన్నర్గా నిలిచారు బాలయ్య..!

Latest news