Moviesబాలయ్య మహరాజ్... సంక్రాంతి సంబ‌రం ' డాకూ మ‌హారాజ్‌ ' ..!

బాలయ్య మహరాజ్… సంక్రాంతి సంబ‌రం ‘ డాకూ మ‌హారాజ్‌ ‘ ..!

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన డాకూ మ‌హారాజ్ సినిమా సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ డూప‌ర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కేవ‌లం నాలుగు రోజుల్లోనే రు. 100 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. ఈ క్ర‌మంలోనే బాల‌య్య‌ను.. డాకూ మ‌హారాజ్ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. చాలా రివ్యూలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.. ఈ క్ర‌మంలోనే అడుసుమిల్లి శ్రీనివాసరావు రాసిన రివ్యూ కూడా బాగా వైర‌ల్ అవుతోంది. ఈ రివ్యూను ఈ క్రింది విధంగా చూద్దాం.

daaku maharaj is the perfect movie for sankranthi - NTV Telugu

బాలయ్య..బాబీ..ధమన్..నాగవంశీ కాంబినేషన్..!
బాలయ్య దర్శకుడి హీరో..!
వాడుకున్నోళ్ళకి వాడుకున్నంత..!
చూపించుకున్నోళ్ళకి చూపించుకున్నంత..!
వరుస సక్సెస్ లు..బ్లాక్ బస్టర్ హిట్లు..!
అంచనాలు భారీగా ఉంటాయి..!
సంక్రాంతి సినిమా అంటే మరింత ఎక్కువ..!

డాకూ మహరాజ్..!
టైటిల్ చూస్తే లోపల ఏదో తేడా కొట్టింది..!
టీజర్లు..ట్రైలర్సు..మోషన్ పిక్చర్స్..పోస్టర్లు చూస్తే..కాన్ఫిడెన్స్ ఏదో ఉందనిపిస్తుంది.
దర్శకుడు బాబీ ధీమా..మాటల్లో వ్యక్తమవుతూ వచ్చింది..!
అయినా కొంచెం అనుమానం..బాలయ్యని ఎలా చూపిస్తాడా అని..!
ధమన్ దరువు గురించి ముందే హెచ్చరించాడు..ఆ మేరకు అభిమానులకు నమ్మకం ఉన్నది.
నిర్మాత నాగవంశీ..ఆ ఆటిట్యూడ్ చూస్తే ముచ్చటేస్తుంది.
సో క్యూట్..!
కాన్ఫిడెన్స్ లెవల్ ఆల్ టైమ్ హై..!

Daaku Maharaj Review: 'డాకు మహారాజ్' ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

ఇక సినిమా విషయానికి వస్తే..!
బాలయ్య సినిమా దర్శక నిర్మాతలకు చాలా చిక్కొచ్చిపడింది.
ఒకదాన్ని మించి మరొకటి ప్లాన్ చేసుకోవాలి తీయాలి..!
డాకూమహరాజ్..!
ఎలివేషన్..లైట్ ఎమోషన్..యాక్షన్ చాలా బాగా అమిరాయి.
చిత్ర ప్రారంభం నుండి చివరి వరకు ఆద్యంతం ఆసక్తికరం..ఆశ్చర్యకరం..!
బాలయ్య అందంగా కొత్తగా కనిపించాడు.
డైలాగులు ధాటిగా భారీగా లేవు కాని ఉన్నవి మాత్రం బాగా పేలాయి.
గుర్రపు స్వారీ సీన్లు..కన్నుల పండుగ..!
ఇసుక తుఫాను మధ్యలోంచి బాలయ్య వచ్చే దృశ్యం..అభిమానులు సహా ప్రేక్షకులకు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది.బాలయ్య కు తగ్గ విలన్స్..!
అనవసర పాటలు.‌డ్యుయెట్స్ లేకపోవటం పెద్ద ఉపశమనం..!
ఐటెమ్ సాంగ్ పెద్ద సెన్సేషన్..!
సహనటులు అందరూ వారి పాత్రలు తగ్గట్టుగా నటించారు మెప్పించారు..!

ఒక సీన్ మాత్రం మర్చిపోలేకపోతున్నాను.
సాధారణం గా హీరో ఉండే సీన్ ఎలివేషను ఎమోషను పండిస్తారు.
కాని బాలయ్య సీన్ లో లేకుండానే..డాకూ ఫౌజీ తో ఒక సీను ఉంటుంది.
బాలయ్య ఉన్నట్టే అనిపిస్తుంది..!
వెంటనే బాలయ్య ఎంటర్ అవుతాడు..!
గూస్ బంప్స్..!
ఇలాంటి సీన్లు..ప్రధమార్ధం నాలుగు..ద్వితీయార్ధం లో నాలుగు ఉంటాయి.
కొందరు ఫస్ట్ ఆఫ్ ఇరగదీసింది..!
సెకండాఫ్ కొంచెం వీక్ అన్న మాట వినబడింది.
అసలు సెకండాఫే అదుర్స్..!
బాలయ్య ఫేన్స్ కి ఫూనకాలువస్తాయి.
విచిత్రంగా ఫాన్స్ కాని వాళ్ళు కూడా శివాలు ఎత్తుతారు.Daaku Maharaj Trailer: బాలయ్య వైల్డ్ పెర్ఫార్మెన్స్.. వణుకు పుట్టిస్తున్న 'డాకూ  మహారాజ్'సెకండ్ ట్రైలర్ .. | Balakrishna Daaku Maharaaj trailer release with  Balayya powerful trademark ...ధియేటర్లో బాలయ్య కనిపించినంత సేపు ఎంజాయ్ చేస్తారు..అన్నీ మరచి పోయి.
తర్వాత ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి సెకండాఫ్ కొంచెం వీక్ అంటారు.
అసలు డాకూ అంటే ఫ్లాష్ బేక్ పెట్టి ఛంబల్ లోయ బందిపోటు దొంగలు..పెద్దల్ని కొట్టి పేదలకు పెట్టే కేరెక్టర్ డిజైన్ చేసాడేమో అనుకున్నాను.
కాని చాలా మంచి పాయింట్..ఆకట్టుకునే లాజికల్ కధనం..!
అందుకే సినిమా దబిడి దిబిడి..!
ఆ విషయంలో బాబీ వెల్ డన్..!
బీజీయమ్..ధమన్ నీకో దండం..సరిలేరు నీకెవ్వరు..!Daku Maharaj : 'డాకు మహారాజ్' లో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా..? ఈమె  తండ్రి ఒక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్..ఎన్నో అవార్డ్స్ కూడా ఉన్నాయి! |  entertainment ...లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బాలయ్య భలే అందంగా ఉన్నాడు.
అలాగే బాలయ్య సినిమాలకు లాభాలు బాగా వస్తాయి..ఎందుకో అందరికీ ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది.
సంక్రాంతి సంబరం..డాకూ మహరాజ్..!

Latest news