ప్రస్తుతం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వస్తున్న రెస్పాన్స్ కంటే కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ ఆ సినిమా స్టామినా.. రేంజ్‌ను డిసైడ్ చేస్తోంది. ఈ జాబితాలో స్టార్ హీరోలతో మొదలు పెట్టి చిన్న హీరోల వరకు చాలా మంది ఉంటున్నారు. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు ఫ్యాన్స్ వార్స్ ఏ రేంజ్‌లో నడుస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సోషల్ మీడియా వార్‌లో మరో ప్రెస్టేజియస్ మూవీ కూడా వార్ చేయక తప్పని పరిస్థితి నెలకొంది.ఆ సినిమా ఏదో కాదు వార్ 2. టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ వార్-2 ’ . ప్రస్తుతం వార్ 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో తారక్‌తో పాటు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో తారక్ పాత్ర ఎలా ఉండబోతోంది ? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పైగా తారక్ బాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి చేస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్టు కావడంతో.. సినిమాలో తారక్ పాత్ర ఏ మాత్రం తేడా కొట్టినా.. హృతిక్‌తో పోలిస్తే తారక్ పాత్ర ఏ మాత్రం తగ్గినా కూడా యాంటీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఏకమైన మరీ సోషల్ మీడియలో ట్రోలింగ్‌కు దిగుతారు ? అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఎన్టీఆర్ గత సినిమా దేవర కు కూడా సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే. మరి ఎన్టీఆర్ వార్ 2 ద్వారా ఎలాంటి ట్రోలింగ్ లేకుండా ఎలా చూసుకుంటాడో ? చూడాలి.
ఎన్టీఆర్ ‘ వార్ 2 ‘ ను సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తోందెవరు..?
