“బాలయ్య” సినిమా రిలీజ్ అవుతుంది అంటే సినిమా హిట్ అవుతుందా ..? ఫ్లాప్ అవుతుందా..? అని ఆలోచించడం మానేసారి జనాలు . అలాంటి రోజులు కూడా పోయాయి . అఖండ తర్వాత వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు మీద హిట్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు బాలయ్య . ఫుల్ స్వింగ్ మీద ఉన్నాడని చెప్పాలి . బాలయ్య తాజాగా నటించిన సినిమా “డాకు మహారాజ్”. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కోసం అటు బాలయ్య ఇటు బాబీ ఇద్దరు కూడా బాగా కష్టపడ్డారు. ఉన్న కాల్ షీట్స్ ను సరిగ్గా ఉపయోగించుకొని చాలా తక్కువ టైంలోనే ఈ సినిమా షూట్ ను కంప్లీట్ చేశారు .కాగా సంక్రాంతి కానుకగా థియేటర్స్ రిలీజ్ అయిన “డాకుమహారాజ్” సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకున్న విషయం అందరికీ తెలుసు . గత 24 గంటల నుంచి సోషల్ మీడియా మొత్తం “డాకు మహారాజ్” వార్తలతో మారుమ్రోగిపోతుంది. చాలామంది “డాకు మహారాజ్” సినిమా రివ్యూస్ ను హైలెట్ చేస్తున్నారు. పైగా ఎప్పుడు బాలయ్య అంటే నెగిటివ్ గా వార్తలు రాసే ఆ నాలుగు ఐదు సైట్లు కూడా బాలయ్య “డాకు మహారాజ్” సినిమాను ప్రశంసిస్తూ ఏకంగా 3.25 రేటింగ్ ఇచ్చింది. కాగా మొదటిరోజు బాలయ్య “డాకు మహారాజు” మూవీ కలెక్షన్స్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తున్నాయి . అందుకున్న సమాచారం ప్రకారం బాలయ్య నటించిన “డాకుమహారాజు” మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 29.72 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.డాకు మహారాజు మొదటి రోజు పూర్తి కలెక్షన్స్ వివరాలు ఇవే..!
అందుతున్న సమాచారం ప్రకారం..నైజాంలో రూ. 17.50 కోట్లు, రాయలసీమలో రూ.15.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.6 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.5 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ. 5.4 కోట్లు, గుంటూరులో రూ. 7.2 కోట్లు, నెల్లూరులో రూ.2.7 కోట్లు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 67.30 కోట్ల బిజినెస్ చేసింది మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 170 కోట్ల టార్గెట్ తో మూవీ వచ్చింది.. అయితే మొదటి రోజు “డాకు మహారాజు” బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లు వసూల్ చేసిందని సమాచారం అందుతుంది. అడ్వాన్స్ బుకింగ్స్, ఏపీ, ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ , స్పెషల్ కారణంగా బుకింగ్స్‌లో ఎక్సలెంట్ హోల్డ్ చూపించింది. దాంతో అంతవరకే కలెక్షన్స్ వసూల్ చేసిందనే టాక్ వినిపిస్తుంది. మరి ఎంత వసూల్ చేసిందో చూడాలి.. టీమ్ నుంచి అధికారక ప్రకటన రావాల్సి ఉంది.