టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు కెరీర్ పరంగా ఈ ఏడాది మరుపురాని మంచి అనుభూతి మిగిలింది. త్రిపుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ సినిమా తర్వాత రెండేళ్లకు పైగా పెద్ద గ్యాప్ వచ్చినా కూడా దేవర లాంటి పాన్ ఇండియా హిట్ తో ఎన్టీఆర్ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర సినిమా మిక్స్‌డ్ టాక్ తో కూడా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రు. 550 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో ఎలా ఉంటుందో దేవర సినిమా చూపించింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ సినిమాల పరంగా ఏడు వరస సూపర్ డూపర్ హిట్లతో కెరీర్లో తిరుగులేకుండా దూసుకుపోతున్నాడు.ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎన్టీఆర్ రాజకీయాలకు రావాలని బలంగా కోరుకుంటున్నారు. వాస్తవానికి 2009 సాధారణ ఎన్నికల టైం లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించలేదు. అప్పటినుంచి ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే టైంలో ఎన్టీఆర్‌కు చంద్రబాబు, ఇటు బాలయ్య ఫ్యామిలీలతో కూడా ఎంత లేదన్నా గ్యాప్ ఉన్నట్టు వాతావరణం కనిపిస్తోంది. ఈ టైంలో ఎన్టీఆర్ తనకు ఇప్పట్లో రాజకీయాలు సరిపడవని భావించి.. తన సినిమా కెరియర్ పై బాగా ఫోకస్ చేస్తున్నారు.
అయితే అన్ని పరిస్థితులు అనుకూలించి ఎన్టీఆర్ రాజకీయాలపై దృష్టి పెడితే మాత్రం .. 2034 సంవత్సరం తారక్ పొలిటికల్ ఎంట్రీ కి సరైన సమయం అని తెలుగు రాజకీయ వర్గాల్లో చర్చ వినిపిస్తోంది. ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి సైతం తారక్కో పొలిటికల్గా అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. 2034 నాటికి ఏపీలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో ? ఇప్పుడే అంచనా వేయలేం .. ఆ టైంకు ఎన్టీఆర్‌కు రాజకీయంగా సరైన సమయం అని అందరూ అంచనా వేస్తున్నారు.