మామూలుగానే రెమ్యూనరేషన్ అంటే ముందుగా గుర్తొచ్చేది హీరోలే .. వందల కోట్లు తీసుకుంటున్న హీరో – రు. 200 కోట్లు – రు . 300 కోట్లు .. తీసుకుంటున్న సౌత్ హీరో .. ఇలా చాలా వరకు హీరోలో రెమ్యూనరేషన్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతుంది. చాలామంది కోటి రూపాయల రెమ్యూనిరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరో ఎవరు ? అని తెలుసుకుంటారు కానీ హీరోయిన్ ఎవరు ? అన్నది చాలా తక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు. టాలీవుడ్ లో కోటి తీసుకొని ఫస్ట్ హీరో మెగాస్టార్ చిరంజీవి .. ఈ విషయం అందరికీ తెలుసు.
అలాగే రెండు కోట్లు .. మూడు .. నాలుగు ఐదు .. తొలి పది కోట్లు తీసుకున్న హీరో కూడా తెలుగులో చిరంజీవి ఇక తెలుగులో ఫస్ట్ టైం కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ ఎవరు ? అంటే చాలామంది అనుష్క – త్రిషనో – సమంత – రష్మిక – నయనతార పేరు చెబుతారు. కానీ వీళ్ళు ఎవరు కాదు ? తెలుగులో ఫస్ట్ కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ ఇలియానా. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో మాత్రమే కాదు సౌత్లో కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్గా రికార్డుల్లోకి ఎక్కింది.
2006లో రామ్ హీరోగా వచ్చిన దేవదాసు సినిమాతో ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ఆమె సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత రెండో సినిమా ఏకంగా మహేష్ బాబు పక్కన ఛాన్స్ కొట్టేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ దెబ్బతో ఇలియానా ఎక్కడికో వెళ్ళిపోయింది. రవితేజతో ఆమె చేసిన ఖతర్నాక్ సినిమా కోసం కోటి రూపాయలు తీసుకుని అప్పట్లో సెన్షేషన్ క్రియేట్ చేసింది.