రాజమౌళి , మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం ఇండియన్ సినిమా ఏ కాదు ప్రపంచ సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .. త్రిబుల్ ఆర్ రిలీజ్ కు ముందే రాజమౌళి, మహేష్ తో చేయబోయే కొత్త సినిమాను ప్రకటించారు .. ఆ సినిమా విడుదలై మూడేళ్లు దాటుతున్న ఇప్పటికీ కూడా రాజమౌళి మహేష్ సినిమా పై అధికార ప్రకటన రాలేదు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని అంటున్నారు .. అలాగే చాలామంది పెద్ద స్టార్స్ సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తుంది. కాగా ప్రజెంట్ రాజమౌళి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా కోసం లొకేషన్లు , VFX, గ్రాఫిక్స్ ఇతర పనులు కూడా పూర్తి కావచ్చినట్టు తెలుస్తుంది.ప్రస్తుతం ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల కోసం అన్వేషణ జరుగుతుందట .. ఇప్పటికే పలువురికి స్క్రీన్ టెస్ట్ లు కూడా నిర్వహించి నటీనట్లను ఎంపిక చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. రీసెంట్ గా హాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా అయిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా రాజమౌళి , మహేష్ బాబు సినిమాలో నటించనుందని పలు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ప్రియాంక చోప్రా తో పాటు సౌత్ స్టార్ నటుడు లీడ్ రోల్ నటించిబోతున్నాడని అంటున్నారు .. ఆయన మరెవరో కాదు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ . మలయాళం తో పాటు ఇప్పటికే హిందీ , తెలుగు , తమిళ భాషల్లో పృధ్వీరాజ్ నటించారు .. స్టార్ హీరోగా దర్శకుడుగా మల్టీ టాలెంటెడ్ గా సత్తా చాటున ఈ అగ్ర హీరో ఇప్పుడు రాజమౌళి , మహేష్ బాబు సినిమాలో ప్రధాన పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తుంది. ప్రభాస్ నటించిన సలార్ సినిమాలో పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
అలాగే ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటుడు థోర్’ ఫేమ్ క్రిస్ హెమ్స్‌వర్త్ నటించనున్నాడని ప్రచారం కూడా జరుగుతుంది .. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్గా హాలీవుడ్ బ్యూటీ నటించబోతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. వీటిపై ఎలాంటి అధికార ప్రకటన కూడా బయటికి రాలేదు .. కాగా ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభించబోతున్నట్టు తెలిసింది .. అలాగే 2027లో ఈ సినిమాను రిలీజ్ చేస్తారని కూడా అంటున్నారు. అలాగే ఈ సినిమా కోసం దాదాపు 1000 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నారట ఇక మరి ఈ సినిమాను హాలీవుడ్ స్టైల్ లో నిర్మించేందుకు రాజమౌళి రెడీ అవుతున్నారు .. ఈ సినిమాతో తెలుగు సినిమాను రాజమౌళి ఎలాంటి స్థాయికి తీసుకువెళ్తారో చూడాలి.
మహేష్ రాజమౌళి సినిమాలో ఊహించని పాన్ ఇండియా హీరో.. హాలీవుడ్ బాక్సాఫీస్ కు చుక్కలే..!
