Movies"నేను కూడా దాని కోసమే వెయిటింగ్".. మెగాస్టార్ చిరంజీవి ఇంత ఓపెన్...

“నేను కూడా దాని కోసమే వెయిటింగ్”.. మెగాస్టార్ చిరంజీవి ఇంత ఓపెన్ గా చెప్పేసాడు ఏంటి..?”

మెగాస్టార్ చిరంజీవి ఏ విషయం అయినా సరే చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రియాక్ట్ అవుతాడు.. మరీ ముఖ్యంగా మెగాస్టార్ ఒక సినిమాకి కానీ ఒక వెబ్ సిరీస్ కి కానీ రివ్యూ ఇచ్చాడు అంటే మాత్రం అది కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అయింది అని అర్థం ..అదంతే మెగాస్టార్ లాంటి వాళ్ళు రివ్యూ ఇచ్చాక ఆ సిరీస్ గురించి చాలామంది మాట్లాడుకుంటారు . కాగా రీసెంట్గా పరువు అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే .

ఈ పరువు అనే వెబ్ సిరీస్ ను సుస్మిత కొణిదెల నిర్మించారు . కాగా ఈసిరీస్లో నాగబాబు ప్రధాన పాత్రలో కనిపించారు. ఇది మొత్తం పరువుకు సంబంధించిన వెబ్ సిరీస్ .. పిల్లలు ప్రేమించి పారిపోయినప్పుడు పరువు ఎంత ఇంపార్టెంట్ గా ఫీల్ అవుతారు పెద్దలు అనే విషయాన్ని బాగా చూపించారు. మరి ముఖ్యంగా చందు అనే ఒక క్యారెక్టర్ ఈ సిరీస్ కి హైలైట్ .. అసలు సిరీస్ మొత్తం తిరిగేది ఆ చందు క్యారెక్టర్ చుట్టే..

రీసెంట్ గా ఈ సిరీస్ చూసిన చిరంజీవి సోషల్ మీడియా వేదికగా రివ్యూ ఇచ్చారు. అది కాస్త వైరల్ గా మారింది . చాలా చాలా అద్భుతంగా ఉంది సిరీస్ .. చందు క్యారెక్టర్ అయితే హైలెట్ .. చందు క్యారెక్టర్ ని చంపేసి ఆ జంట పడిన కష్టం బాధలు వర్ణాతీతం .. చాలా చక్కగా డైరెక్ట్ చేశారు ..సుస్మిత కొణిదెల ను అభినందిస్తున్నాను. నాగబాబు తనదైన స్టైల్ లో నటించిన ప్రాణం పోశాడు ఈ పాత్రకు .. ఇలాంటి వెబ్ సిరీస్ చాలా లేట్గా చూస్తూ ఉంటాం . సీజన్ 2 కోసం నేను ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే పోస్ట్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news