Moviesఓరి దేవుడోయ్..అనసూయలో ఈ యాంగిల్ కూడా ఉండా..? ఆ నడు మడతోనే...

ఓరి దేవుడోయ్..అనసూయలో ఈ యాంగిల్ కూడా ఉండా..? ఆ నడు మడతోనే చంపేస్తుందిగా..!

ప్రజెంట్ ఇప్పుడు సినీ లవర్స్ ఎంతో ఈగర్ గా ఆత్రుతగా వెయిట్ చేస్తున్న సినిమా పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు ఎలాంటి ఆశలు ఊహలు పెట్టుకుని ఉన్నారో మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా బన్నీ సినిమా కోసం ప్రాణం పెట్టి నటిస్తున్నాడు. సపరేట్ డైట్ ఫాలో అవుతూ బాడీ రూపురేఖలను మార్చేశాడు. ప్రతి విషయంలోనూ అల్లు అర్జున్ సుకుమార్ చాలా కేర్ఫుల్గా నిర్ణయం తీసుకుంటున్నారు . ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది .

ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాల్లో ప్రతి ఒక్క నటీనటుల విషయంలో సుకుమార్ చాలా చాలా కేర్ తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీం . నిన్న అనసూయ పుట్టినరోజు ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ని షేర్ చేసింది . ఎర్రచందనం కలప ఉండే చోట ఓ టేబుల్ పై ఆమె కూర్చుని పక్కనే మందు బాటిల్ తో దాక్షాయినిగా చమత్కారమైన యాసతో నోట్లో గుట్కా నములుతూ మందు తాగుతున్నట్లు కనిపిస్తుంది .

ఆమె వెనక రౌడీలు కూడా ఉన్నారు . ఎవరితో సీరియస్గా చర్చిస్తున్నట్టు స్టిల్ కూడా ఉంది . ఈ ఫోటో ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . అనసూయ ఇంత వైల్డ్ గా ఇంత మాస్ లుక్ లో కనిపించడం పట్ల ఆమెలోని నటన టాలెంట్ను జనాలు గుర్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతుంది . కాగా ఈ సినిమాల్లో మలయాళీ నటుడు ఫహెద్ ఫజిల్..సునీల్ ..రావు రమేష్ వంటి వాళ్ళు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు దేవిశ్రీప్రసాద్ . ఇప్పటికే సినిమా నుంచి ఫస్ట్ పాట రిలీజ్ అయింది. పుష్ప పుష్ప పుష్ప అంటూ ఆకట్టుకునేసింది. త్వరలోనే సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ కాబోతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news