పరిచయం :
దళపతి విజయ్ హీరోగా నటించిన తాజా సినిమా
( దిగ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం). డి ఏజింగ్ కాన్సెప్ట్ ద్వారా హీరో విజయ్ యంగ్ లుక్‌లోకి రావడం ఏ ఐ ద్వారా విజయకాంత్ పునః సృష్టి.. త్రిష స్పెషల్ సాంగ్… దర్శకుడు వెంకట్ ప్రభు క్రియేషన్ గురించి చర్చ జరగడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ ద్విపాత్రభినయం చేసిన ఈ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అంచనాలు అందుకుందో ? లేదో సమీక్షలో చూద్దాం.
కథ :
గాంధీ ( విజయ్ ) స్పెషల్ యాంటి టెర్రరిస్టు స్క్వాడ్ టీమ్లో కీలకంగా పనిచేస్తూ ఉంటారు. భార్య అను ( స్నేహ) కు ఉద్యోగం గురించి చెప్పడు. ఓ మిషన్ కోసం భార్యాపిల్లలతో థాయిలాండ్ వెళ్లినప్పుడు కొడుకు జీవన్ ( విజయ్ ) ను కోల్పోతాడు. కుమారుడు మరణించాడని తనకు తాను గాంధీ శిక్ష విధించుకుంటాడు. స్క్వాడ్ వదిలి బయటకు వచ్చేస్తాడు. 15 ఏళ్ల తర్వాత మాస్కోలో గాంధీకి జీవన్ కనిపిస్తాడు. కొడుకు కనిపించిన సంతోషంలో ఇండియాకు తీసుకువస్తాడు.. అంతా హ్యాపీగా ఉన్న టైంలో గాంధీ కళ్ళ ముందు అతని బాస్ నజీర్ ( జయరామ్ ) ని ఎవరో చంపేస్తారు. ఆ తర్వాత గాంధీ సన్నిహితులు ఒక్కొక్కరు హత్యకు గురవుతూ ఉంటారు. ఆ హత్యల వెనుక ఉన్నది ఎవరు? మేనన్ (మోహన్ ) ఎవరు ? తండ్రి గాంధీ మీద కొడుకు జీవన్ ఎందుకు పగతో ఉన్నాడు.. చివరకు ఏమైంది అన్నదే ఈ సినిమా కథ.
విశ్లేషణ :
రాజకీయాల్లో విజయ్ అడుగుపెట్టడం మరో సినిమా చేసే అవకాశం లేదని ప్రచారం జరగడంతో ది గోట్ పై తమిళనాడులో అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అంత బాధ లేదు.. ట్రైలర్ కూడా అంత ఇంప్రెస్సివ్ గా లేదు. ఇక కథనం విషయానికి వస్తే దర్శకుడు వెంకట్ ప్రభు చెప్పిన కథలో ఏ పాయింట్ నచ్చి ఈ సినిమాకు విజయ్ ఓకే చెప్పారు.. అసలు ఈ సినిమా ఏ ఉద్దేశంతో చేయాలని అనుకున్నారు అన్నది ఫ్రీ ఇంటర్వెల్ వరకు మైండ్లో ఎవరికి ఓ పట్టాన తట్టదు.. అప్పటివరకు అంత రొటీన్ రొడ్డ కొట్టుడు మూస తమిళ సన్నివేశాలతో ఈ సినిమా సాగుతుంది. అయితే ఇంటర్వెల్ తీసిన విధానం.. మెట్రోలో ఫైట్ సీక్వెన్స్ అదిరిపోయాయి. ఫస్టాప్ తో కంపేర్ చేస్తే సెకండా బెటర్ అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో కూడా చాలా ఉంది ఇంటర్వెల్ ముందు కొడుకు విలన్ అని రివీల్ చేశాక సెకండ్ హాఫ్ లో తండ్రి కొడుకులు మధ్య ఆట ఎలా ఉంటుందో ? ఆ క్లైమాక్స్ ఏ విధంగా ఉంటుంది అనేది ఊహించడం కష్టం కాదు.. అంతలా సాగదీశారు దర్శకుడు వెంకట్ ప్రభు.
స్పెషల్ యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ అని పేరు పెట్టారు కానీ ది గోట్ లో కంటే తుపాకీ లో టెర్రరిస్టులను కనిపెట్టి చంపే సన్నివేశాలు చాలా బాగుంటాయి. ఆ సీన్స్ పక్కన పెడితే భార్యాభర్తల మధ్య వచ్చే సీన్లు చాలా రొటీన్ గా ఉంటాయి. రాత్రి భర్త ఇంటికి రాకపోవడంతో ఆయన స్నేహితులకు భార్య ఫోన్ చేసిన సన్నివేశం చూస్తే వెంకట్ ప్రభులో కొత్తగా రాయాలన్న తపన పోయిందా ? యూట్యూబ్ రీల్స్ పాత సినిమాలు చూసి రాయటం మొదలు పెట్టారా ? అన్న అనుమానాలు వస్తాయి ఇక గాంధీ – నెహ్రూ – బోస్ కామెడీ ట్రాక్ కూడా నవ్వించలేదు.. వెంకట్ కథలో ట్విస్టులు ఉన్నాయి కానీ అవి ముందుగా తెలిసిపోతూ ఉంటాయి. ఒకవేళ తెలియని ట్విస్ట్ వచ్చిన అది ఆసక్తిగా అనిపించదు. అదే గోట్ స్పెషాలిటీ.
దర్శకుడు రచన.. దర్శకత్వంలో ఫాదర్ వర్సెస్ సన్ కాన్సెఫ్ట్ తప్ప సినిమా అంతా పాత తమిళ వాసనలు కొట్టింది. దీనికి తోడు సినిమా రన్ టైం చాలా ఎక్కువ కావటం మైనస్.. క్లుప్తంగా ముగించాల్సిన సీన్లు సైతం సాగదీసి సాగదీసి చెప్పారు. ఒక పాటకు సరైన ప్లేస్మెంట్ లేదు.. సరి కదా ఒక పాట కూడా మళ్లీ వినాలని అనిపించేలా లేదు. పాటలు నేపథ్య సంగీతంలో యవన్ శంకర్‌రాజా తీవ్రంగా డిజప్పాయింట్ చేశారు. డీఏ కెమెరా వర్క్ చేసిన యంగ్ విజయ్ లుక్ జస్ట్ ఓకే.. హీరోలను ఎప్పుడు హీరోలుగా చూస్తే కిక్కేముంటుంది ..అప్పుడప్పుడు వారిలో విలనిజం చూస్తే కిక్కు ఉంటుంది.. అందుకు ది గోట్ బెస్ట్ ఎగ్జాంపుల్. విజయ్ చేసిన కొన్ని సీన్లు ఆయన మేనరిజం.. పంచ్ డైలాగ్స్ కొన్ని బాగుంటాయి.
హీరోతోపాటు స్క్వాడ్ టీం లో పనిచేసే సహోద్యోగులుగా ప్రభుదేవా – జీన్స్ ప్రశాంత్ – అమీర్ కనిపించారు. వాళ్ళ బాస్ పాత్రలో జయరాం నటించారు. స్నేహకు ఇంపార్టెన్స్ ఉన్న రోల్ లభించింది. మీనాక్షి చౌదరి అతిధి పాత్రలో సందడి చేశారని చెప్పాలి.. ఆమె ఒకటి రెండు సీన్లు పాటలో మాత్రమే కనిపించారు. మీనాక్షి చౌదరి కంటే విజయ్ – త్రిష పాట బాగుంది. సినిమా స్టార్టింగ్ లో ఏఐ ద్వారా కెప్టెన్ విజయకాంత్ ను చూపించడం బాగుంది. సినిమాలో ఫ్రీ ఇంటర్వెల్ ఫైట్ ఒకటి మాత్రమే బాగుంది. ఫాదర్ వర్సెస్ సన్ కాన్సెప్ట్ ఓకే కానీ దర్శకుడుగా వెంకట్ ప్రభు… సంగీత దర్శకుడుగా యువన్ శంకర్ రాజా ఇద్దరు తీవ్రంగా నిరాశపరిచారు.
ఫైనల్‌గా…
ది గోట్ .. ది గ్రేట్ కాదు పెద్ద తుప్పు
ది గోట్ రేటింగ్ : 2 / 5