Moviesప్రతినిధి 2 మూవీ రివ్యూ: మాయ ముసుగులో ఉన్న జనాల కళ్లు...

ప్రతినిధి 2 మూవీ రివ్యూ: మాయ ముసుగులో ఉన్న జనాల కళ్లు తెరిపించే సినిమా.. సీఎం అయితే పరిస్ధితి ఇలా ఉంటుందా..?

ఇది టోటల్ పొలిటికల్ ధ్రిల్లర్ సినిమా అని చెప్పుకోవచ్చు . ప్రతినిధి సినిమా ఎలా ఉందో దానికి డబల్ రేంజ్ లో ప్రతినిధి 2 సినిమా జనాలను ఆకట్టుకుంటుంది . ఇది నిజంగానే ప్రాపగండా చిత్రమా ..?లేదా ఫిక్షనల్ పొలిటికల్ థ్రిల్లరా?..కొన్ని కొన్ని సీన్స్ అర్థం కాకుండా మారిపోయాయి . ప్రజాసేవ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపతి (సచిన్) ప్రజా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి రెండోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉంటారు . అయితే ఓ రోజు రాత్రి క్యాంప్ ఆఫీస్ లో పనిచేస్తూ ఉండగా ఎవరో దుండగులు బాంబు దాడి చేస్తారు .

ఆ దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోతాడు . మరణం తర్వాత ఆయన కొడుకు విశ్వం తదుపరి ముఖ్యమంత్రి కావాలి అని పార్టీ నేతలు కోరుకుంటూ ఉంటాతు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా మారాడా ..? ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారా ..? అసలు ఎవరు ముఖ్యమంత్రిని చంపారు..? ఆ అవసరం ఎవరికి ఉంది..? పొలిటికల్ కోసం ఏమైనా చేస్తారా..? ఈ కేసులో ఒక ప్రధాన న్యూస్ ఛానల్ సీఈఓ హస్తం కూడా ఉంది.. అనే విధంగా కథను మలుపు తిప్పుతూ ప్రతినిధి 2 ను తెరకెక్కించారు మూర్తి .

నిజాన్ని నిర్భయంగా చెప్పే కథ ఈ ప్రతినిధి 2. ఇంకా పక్కాగా చెప్పాలంటే నేటి కాలం రాజకీయ పరిస్థితులకు ఈ కథ అద్భుతంగా సూట్ అవుతుంది . పొలిటికల్ కోసం ఎవరు ఎలా అయినా తెగిస్తారు ..?ఎంత పనైనా చేస్తారు అని ..కళ్ళకు కట్టినట్టు క్లియర్గా చూపించారు మూర్తి. మరీ ముఖ్యంగా సీఎం క్యాంప్ ఆఫీస్ లో బాంబ్ బ్లాస్ట్ సన్నివేశం అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది . కచ్చితంగా ఈ సినిమా జనాలను ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయకూడదు అనే విషయం పై అవగాహన కల్పించేందుకు తెరకెక్కించిన మూవీ గానే తెలుస్తుంది .

కాకపోతే ఇంటర్వెల్ ట్విస్ట్ రెండో సగం పై బాగానే ఆసక్తి పెంచగలిగిన ..అక్కడక్కడ కొన్ని సీన్స్ ల్యాగ్ అయ్యాయి . మొత్తానికి నారా రోహిత్ కి ఇది మంచి కం బ్యాక్ సినిమా అనే చెప్పాలి . తనదైన యాక్షన్ డైలాగులతో బాగా అదరగొట్టేసాడు. అంతేకాదు దినేష్ – తనికెళ్ల భరణి – ఉదయభానుతో పాటు మిగతా వాళ్ళు కూడా తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. చూద్దాం ఈ సినిమా చూసైన జనాలు సరీన రాజకియ నాయకుడికి ఓటు వేస్తారో..? లేదో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news