ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో ..పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ కి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ప్రభాస్ స్టార్ స్టేటస్ అందుకున్న తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో పబ్లిసిటీ సంపాదించుకున్న తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది . ఇప్పుడు ఆయనకి సంబంధించిన వార్తలు ప్రతిదీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే ట్రెండ్ అవుతున్నాయి .
కాగా మరికొద్ది రోజుల్లోనే కల్కి ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభాస్ . ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ కోసం ఒక హీరోయిన్ చేసిన బిగ్ రిస్క్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ తన కెరీర్ లో చాలామంది అమ్మాయిలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ ప్రభాస్ కి ది పర్ఫెక్ట్ ఆన్ స్క్రీన్ జోడి అంటే మాత్రం త్రిష అన్న పేరే వినిపిస్తుంది . వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ .
అయితే వీళ్ళ కాంబోలో వచ్చిన వర్షం సినిమా చరిత్ర తిరగరాసింది . ఈ సినిమా కోసం త్రిష ఏకంగా 20 రోజులపాటు వర్షంలో నిరంతరంగా తడిచిందట . ఆ టైంలో ఆమెకు ఆరోగ్యం బాగో లేకపోయినా సరే సినిమా హిట్ అవ్వడానికి బిగ్ రిస్కే చేసిందట. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది . ఈ సినిమా హిట్ అవ్వడానికి ప్రభాస్ నటన ఎంత కారణమో .. త్రిష డెడికేషన్ కూడా అంతే కారణం అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది..!!