టైటిల్: బహుముఖం
నటీనటులు: హర్షివ్ కార్తీక్ (తన్వీర్), స్వర్ణిమ సింగ్, మరియా మార్టినోవా తదితరులు
సినిమాటోగ్రఫీ: ల్యూక్ ఫ్లెచర్
నేపథ్య సంగీతం: శ్రీ చరణ్ పాకాల
మ్యూజిక్: ఫణి కళ్యాణ్ సంగీతం
నిర్మాత – దర్శకత్వం: హర్షివ్ కార్తీక్
తన్వీర్ హర్షిత్ ఆల్‌రౌండర్‌గా మారి తెరకెక్కించిన సినిమా బహుముఖం. బహుముఖం అని డిఫరెంట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటోందో TL సమీక్షలో చూద్దాం.
TL స్టోరీ :
తన్వీర్ ( హర్షివ్ కార్తీక్ ) అమెరికాలో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన యువకుడు. నటుడు కావాలని ఎప్పటికైనా వెండితెరపై ఒక వెలుగు వెలుగుపోవాలని కలలు కంటూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కుని జైలు జీవితం అనుభవిస్తాడు. అక్కడి నుంచి బయటికి వచ్చాక నటనలో రాణించాలని పరితపిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తన్వీర్ చేసే ప్రయత్నాలు అన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఓసారి సైకో పాత్ర అడిషన్ ఇస్తే సరిగ్గా చేయలేదని అందరూ విమర్శిస్తారు. దీంతో ఆ పాత్రను ఎలాగైనా బాగా చేయాలని మంచి నటుడు అవ్వాలని.. ఒక విధమైన డిప్రెషన్ లోకి వెళ్లి పోతాడు. ఈ క్రమంలోనే అతడు ఆ పాత్ర బాగా చేయాలని పరితపిస్తూ నిజమైన సైకోలా మారి హత్యలు చేస్తూ ఉంటాడు..? అసలు తన్వీర్ ఎందుకు జైలుకు వెళ్లాడు..? ఎందుకు సైకోలా మారాడు..? ఎందుకు హత్యలు చేశాడు..? అతడు నటుడు అయ్యాడా..? లేదా..? అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
TL విశ్లేషణ :
హర్షివ్ కార్తీక్ సినిమాల మీద ఆసక్తితో అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ.. ఇటు ఈ సినిమా తీశాడు. ఈ సినిమాకి అతడే రచయిత, హీరో, దర్శకుడు, నిర్మాత కూడా. ఇలా బహుముఖం సినిమాకు తగ్గట్టుగానే హర్షివ్ బహుముఖంగా అన్ని పాత్రలు పోషించాడు. సినిమా షూటింగ్ మొత్తం అమెరికా నేపథ్యంలోనే జరుగుతుంది. అక్కడ ఉన్న భారతీయులతో పాటు అమెరికా నటీనటులతో సినిమా తెరకెక్కించారు. కథ మాత్రం చాలా బాగా రాసుకున్నాడు. కానీ థ్రిల్లింగ్ సినిమాకి సరిపడా ట్విస్టులు సినిమాలో లేకపోవడం.. కొంచెం ఇబ్బంది పెడుతుంది. నటీనటుల విషయానికొస్తే సినిమాకు మెయిన్ పిల్లర్ అయిన హర్షివ్ కార్తీక్.. సినిమా మొత్తాన్ని తన భుజస్కృందాలపై వేసుకొని నడిపించాడు.
ఓ పక్కన నటుడు అవ్వాలని తపన.. మరోపక్క సైకోగా అదరగొట్టేసాడు. ఇక స్వర్ణిమ సింగ్ పేరుకు మాత్రం హీరోయిన్ అని చెప్పినా.. కొన్నిసార్లు మాత్రమే తళుక్కున కనిపించి మాయం అవుతుంది. ఆమెకు తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నా కూడా.. ఉన్నంత వరకు పరవాలేదనిపించింది. ఇక అమెరికన్ నటి మరియా మార్టినోవా మెప్పిస్తుంది. మిగిలిన నటీనటులు అందరూ అమెరికాలో ఉండే వాళ్లే ఉండడంతో తెలుగు వాళ్లకు కొత్త ముఖాలుగా కనిపించారు. ఎవరు స్టార్ కాస్ట్ లేకపోయినా.. రచయిత, దర్శకుడు ఒకరే కావడంతో వాళ్లతో తనకు కావలసిన విధంగా చెప్పి నటన చేయించుకున్నాడు.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో హర్షివ్ కార్తీక్ నటన… తన్వీర్ పాత్రలోని అమాయకత్వం, నిరాశ, కాన్ఫిడెన్స్ వంటి భావాలను చక్కగా పలికించిన హర్షివ్ కార్తీక్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇక సినిమా మొత్తం కథనం ఉత్కంఠభరితంగా సాగుతుంది. తదుపరి ఏం జరుగుతుందో అని ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తుంది.
అమెరికన్ టెక్నికల్ వాల్యూస్ అదిరిపోయాయి. అమెరికాలో షూటింగ్ చేసిన ఈ చిత్రం హాలిವುడ్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో రూపొందింది.
మైనస్ పాయింట్స్ :
కొత్తదనం లేని కథ… సైకలాజికల్ థ్రిల్లర్ అనే కాన్సెప్ట్ కొత్తదే కాదు. కథలో కొంచెం కొత్తదనం ఉంటే మరింత ఆసక్తికరంగా ఉండేది. కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం వల్ల థ్రిల్ మిస్ అయిన ఫీల్ కలుగుతుంది.
టెక్నికల్‌గా ఎలా ఉందంటే..
టెక్నికల్ గా చూస్తే సినిమాకి సినిమాటోగ్రఫీ, విజువల్స్, నేపథ్య సంగీతం.. చాలా చాలా ప్లస్ పాయింట్ అని చెప్పారు. అమెరికన్ సినిమాటోగ్రాఫర్ ఫ్లెచర్ విజువల్స్ అదిరిపోయాయి. కథకి తగినట్టుగా అమెరికాని బాగా చూపించారు. శ్రీ చరణ్ పాకాల ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాలకి మంచి నేపథ్య సంగీతం ఇస్తాడని తెలిసిందే. ఈ సినిమాకి కూడా తన నేపథ్య సంగీతంతో ప్రేక్షకులు కథతో ట్రావెల్ చేసేలా అదరగొట్టేశాడు. ఇక తల్లి కలని తీర్చడానికి కొడుకు ఏం చేశాడు ? అనే సింపుల్ కథ అయిన.. వెండితెర మీద కొత్తగా ప్రజెంట్ చేయడానికి నటుడు, దర్శకుడు హర్షివ్ కార్తీక్ చేసిన ప్రయత్నం అభినందించదగినది. మొదటిసారి అన్ని బాధ్యతలు తీసుకొని ఎక్కడా రాజీ పడకుండా ఇటు నిర్మాణ విలువల పరంగా కూడా సక్సెస్ అయ్యాడు. ఓవరాల్‌గా బహుముఖం సినిమా నటన అంటే పిచ్చి ఉన్న ఓ అబ్బాయి.. తల్లి కల నిజం చేయటానికి నటుడుగా మారాలనుకునే క్రమంలో ఎలా సైకో అయ్యాడు ? అన్న థ్రిల్లింగ్ అంశంతో తెరకెక్కించాడు.
ఫైనల్‌గా…
నటన, సాంకేతిక విలువలు బాగున్నప్పటికీ, కథలో కొత్తదనం లేకపోవడం, కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం వంటి లోపాలున్నాయి. అయితే, సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారిని ఖచ్చితంగా ఆకట్టుకునే అవకాశం ఉంది “బహుముఖం.”
బహుముఖం TL రేటింగ్ : 2.75 / 5