Moviesదట్ ఈజ్ ఎన్టీఆర్ .. తన జిమ్ ట్రైనర్ పుట్టినరోజు సందర్భంగా...

దట్ ఈజ్ ఎన్టీఆర్ .. తన జిమ్ ట్రైనర్ పుట్టినరోజు సందర్భంగా తారక్ ఏం చేశారో చూడండి.. శభాష్..!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా తమకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యాక స్టేటస్ పెరిగిపోయాక ..కోట్ల ఆస్తి సంపాదించుకున్న తర్వాత అసలు కళ్ళు కళ్ళు ప్లేస్లో ఉండవు ..కళ్ళు నెత్తికెక్కి బిహేవ్ చేస్తూ ఉంటారు . అందరూ హీరోలు ఇలా చేస్తారు అని చెప్పలేము కానీ కొంతమంది హీరోలు మాత్రం కచ్చితంగా అదే విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఫ్యాన్స్ ఫోటోగ్రఫీ అడిగితే సెక్యూరిటీ గార్డ్స్ చేత నెట్టించడం.. వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే అక్కడికి ముందుగానే ఫాన్స్ వస్తున్నారు అని తెలిసి భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం కొందరు ..ఫాన్స్ ను చీప్ గా మాట్లాడటం లాంటివి చేస్తూ ఉంటారు కొందరు స్టార్ హీరోలు .

అయితే వాళ్లందరిలోకి ప్రత్యేకం జూనియర్ ఎన్టీఆర్ . ఎంత స్టార్ స్టేటస్ వచ్చినా.. కోట్ల ఆస్తికి అధిపతుడైన .. తారక్ మాత్రం ఎప్పుడు డౌన్ టూ ఎర్త్ అనే పర్సన్ లాగే ఉంటాడు . మరీ ముఖ్యంగా అభిమానుల విషయంలో ఫ్రెండ్షిప్ విషయంలో తారక్ రూటే సపరేటు . ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండాలి అని చెప్పడానికి ది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తారక్ అని చెప్పుకోవడంలో సందేహం లేదు. రీసెంట్గా తన పర్సనల్ జిమ్ ట్రైనర్ బర్త డే ని సెలబ్రేట్ చేశారు . దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

తారక్ పర్సనల్ జిమ్ ట్రైనర్ పేరు కుమార్ మన్నవ . తారక్ ఇంత యాక్టివ్ గా ఇంత ఫిజిక్ తో ఇంత హెల్తీగా మైంటైన్ చేస్తూ ఉండడానికి కారణం ఈయనే. అంతేకాదు ఆయన బర్త్డ డే అని తెలుసుకుని స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చాడు తారక్ . తనకి ఏ ఫుడ్ ఇష్టం ..? ఎలాంటి ఫుడ్ తింటాడు..? ఎలాంటి ఫ్లేవర్స్ ఆయనకు ఇష్టం అన్న విషయం బాగా తెలుసు తారక్ కి . అందుకే తన ఫేవరెట్ కేక్ ను తీసుకెళ్లి సర్ప్రైజ్ గా కట్ చేయించి ఎంతో ప్రేమగా ఆప్యాయంగా బర్త డే ను సెలబ్రేట్ చేశారు . దీనికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . ఈ న్యూస్ తెలుసుకున్న అభిమానులు దట్ ఈజ్ తారక్ అని .. అందుకే అంత పెద్ద స్టార్ హీరో అయ్యాడు అని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news